ఆంధ్ర గాథాలహరి

పనికి రానివి-51

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రాకృతమూలం
సో అత్థో జోహత్థేతం మిత్తం జం ణిరం తరం వసణే
తం రూ అం త్థ గుణా తం విణ్ణాణం జహింధమ్మో (హాలుడు)
సంస్కృత చ్ఛాయ
సోర్థో యోహస్తే తన్మిత్రం యన్నిరంతరం వ్యసనే
తద్రూపం యత్ర గుణా స్తద్విజ్ఞానం యత్ర ధర్మః
తెలుగు
ఆ.వె సుగుణ గరిమలేని సుందరరూపమ్ము
పరుల చేతిలోని సిరుల మూట
ధర్మదృష్టి లేని దండిజ్ఞానమ్మ
పనికిరాని హితుడు వలదు వలదు
హాలుడు స్వయంగా చెప్పిన నీతిగాథ ఇది. గుణం లేని అందంవల్ల ఉపయోగం లేదు. పైగా సమాజానికి నష్టం కూడా! చెంతకాకుండా ఎక్కడెక్కడో ఉంచబడిన ధనంవల్ల ఏమిటి ఉపయోగం? ధర్మదృష్టిలేని విజ్ఞానంవల్ల వినాశనమే! ఉదాహరణ రావణాసురుడే! కష్టంలో ఉపయోగపడకుండా ముఖం చాటేసే మిత్రుడు ఉంటే ఏం?లేకుంటే ఏం?- అంటున్నాడు గాథాకారుడు.
వివరణ:బాహ్య సౌందర్యంకన్నా, అంతఃసౌందర్యమే గొప్పది. ఉత్తమమైన సంస్కారంగల వాళ్ళు లోకానికి చాలా అందంగా కనిపిస్తారు. తనదికాని ధనంవల్ల అదనపు బరువే గానీ ప్రయోజనం శూన్యం. విజ్ఞానం కచ్చితంగా విజ్ఞుడి దగ్గరే ఉండాలి. అందుకే పూర్వకాలంలో దివ్యాస్త్రాలు ఉత్తముల దగ్గర ఉంటే లోక కల్యాణానికి ఉపయోగపడ్డాయి. అవే దుర్మార్గుల దగ్గర ఉంటే హింసకు, జనక్షయానికి దారితీసాయి. ఈ విషయాల్ని నాడే గుర్తించిన హాలభూపాలునకు జోహార్లు. నేడు ఈపద్ధతిని పాటిస్తే భారతదేశం పూర్వవైభవాన్ని పొందుతుంది.
- ఇంకావుంది...

-డి.వి.ఎం. సత్యనారాయణ 9885846949