‘సైరా..’లో సుదీప్ లుక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’ శరవేగంగా షూటింగ్‌ని జరుపుకుంటోంది. సురేఖ కొణిదెల సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్స్ పతాకంపై సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో హై టెక్నికల్ వేల్యూస్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్, నయనతార, తమన్నా విజయ్ సేతుపతి, జగపతిబాబు, సుదీప్ ప్రధాన తారాగణంగా మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ రూపొందిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ఇది. అయితే ఈ ‘సైరా..’లో కన్నడ సూపర్‌స్టార్ సుదీప్ అవుకు రాజు అనే క్యారెక్టర్‌లో నటిస్తున్నారు. సుదీప్ పుట్టిన రోజు సెప్టెంబర్ 2న. ఈ సందర్భంగా అవుకురాజుగా సుదీప్ లుక్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ లుక్‌కు అప్పుడే అందరి ప్రశంసలు లభించాయి. సుదీప్ హావభావాలు, వేషధారణ అందర్నీ ఇట్టే ఆకట్టుకుంటోందని అన్నారు.