మూడేళ్ల కష్టం ఫలించింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజాగౌతమ్, చాందిని చౌదరి హీరో హీరోయిన్లుగా రూపొందుతోన్న చిత్రం ‘మను’. నిర్వాణ సినిమాస్ సమర్పణలో క్రౌడ్ ఫండెడ్‌గా నిర్మితమైన ఈ చిత్రానికి ఫణీంద్ర నార్‌శెట్టి దర్శకుడు. ఈ చిత్రం ఈ నెల7న విడుదలవుతోంది. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన ప్రీరిలీజ్ వేడుకులో మోహన్ భగత్ మాట్లాడుతూ.. ‘్ఫణితో పనిచేసిన తర్వాత గర్వంగా అనిపించింది. తప్పకుండా సినిమా డిఫరెంట్‌గా ఉంటుంది’ అన్నారు. ఆర్ట్ డైరెక్టర్ శివ్‌కుమార్ మాట్లాడుతూ.. ‘కథకు ఎంత ప్రాముఖ్యత ఉందో.. విజువల్స్‌కు కూడా అంతే ప్రాముఖ్యత ఉంటుంది. నాకు సినిమాల పరంగా ఏ ఎక్స్‌పీరియెన్స్ లేదు. మాకు తెలిసిన పద్ధతిలోనే చేసుకుంటూ వచ్చాను. నాకు సహకారం ఇచ్చిన ఫణిగారికి టీమ్‌కి థాంక్స్’ అన్నారు. అభిరామ్‌వర్మ మాట్లాడుతూ..‘ఈ సినిమా మూడేళ్ల కష్టం. ప్రేక్షకులు మా సినిమాను ఆదరిస్తారని భావిస్తున్నాను’ అన్నారు. వెంకట్ మహా మాట్లాడుతూ.. ‘కంచరపాలెం కథ రాసుకున్న తర్వాత క్రౌడ్ ఫండింగ్ ద్వారా సినిమా తీద్దామని ప్రయత్నాలు చేసుకుంటున్న సమయంలో మను ఫేస్‌బుక్‌లో పోస్ట్‌పెట్టారు. సరే! వాళ్ళకు ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో అని ఆసక్తిగా గమనిస్తున్న తరుణంలో... నాలుగురోజుల్లో కోటి రూపాయలు క్రౌడ్ ఫండింగ్ ద్వారా వచ్చిందని ఫణిగారు పోస్ట్ చేశారు. నేను ప్రీ ప్రొడక్షన్ స్టార్ట్ చేసినప్పుడే.. వారి నెట్‌వర్క్ స్టార్ట్ చేశారు. మామధ్య యాదృచ్ఛికంగా చాలా విషయాలు జరుగుతూ వస్తున్నాయి. సక్సెస్‌లో కూడా ఆ కోఇన్సిడెన్స్ ఉండాలని కోరుకుంటున్నాను’’ అన్నారు. జాగర్లమూడి క్రిష్ మాట్లాడుతూ.. ‘చాలా గొప్ప సినిమాలు అవుతాయని ఎక్స్‌పెక్ట్ చేస్తూ వచ్చిన రెండు సినిమాలు మను, కేరాఫ్ కంచెరపాలెం విడుదల కాబోతున్నాయి. మను ట్రైలర్ చూసిన తర్వాత సృజన్ అడిగిన మేర.. ట్వీట్ కూడా చేశాను. అప్పుడే ఎప్పుడైనా ప్రివ్యూ వేస్తే నాకు చూపిస్తారా? అని కూడా అడిగాను. ట్రైలర్ చూసిన తర్వాత ఇలాంటి సినిమా నేను కూడా ఒకటి తీస్తే బావుండు అనిపిస్తుంది. ప్రతి డిపార్ట్‌మెంట్ ప్యాషన్‌తో చేసిన సినిమా ఇది. సృజన్, సందీప్‌తో పాటు 112 మంది సినిమా ప్రియులకు అభినందనలు, శుభాకాంక్షలు, ధన్యవాదాలు అన్నారు. చాందినీ చౌదరి మాట్లాడుతూ.. ‘ఆ చిన్న సినిమాను పెద్దగా ప్రేక్షకుల వద్దకు తీసుకెళ్తున్న నిర్వాణ సినిమాస్‌కు థాంక్స్. ఇలాంటి సినిమాలో భాగమైనందుకు చాలా గర్వంగా ఉంది. టీమ్ అందరికీ థాంక్స్’ అన్నారు.