బిజినెస్

ఇండిగో మెగా ఆఫర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, సెప్టెంబర్ 3: తక్కువ బడ్జెట్‌లో విమాన సౌకర్యాన్ని కల్పిస్తున్న దేశీయ విమానయాన సంస్థ ఇండిగో తాజాగా కొత్త ఆఫర్‌ను ప్రకటించింది. 999 రూపాయల కనిష్ట ధరతో నాలుగు రోజుల పాటు తమ పరిధిలోని ప్రాంతాలకు టికెట్ల అమ్మకం ప్రారంభమవుతుందని ఒక ప్రకటనలో ఇండిగో తెలిపింది. ఆన్‌లైన్‌లో సోమవారం ప్రారంభమైన నాలుగు రోజుల ఈ ఆఫర్ ఆరో తేదీ వరకు కొనసాగుతుందని పేర్కొంది. భారీ స్పందన ఉంటుందని, కాబట్టి ఆఫర్‌లో ఉంచిన టికెట్ల అమ్మకాలు వేగంగా జరుగే అవకాశం ఉందని ఇండిగో తన ప్రకటనలో తెలిపింది. ఈనెల 18 నుంచి వచ్చే ఏడాది మార్చి 30వ తేదీ మధ్యకాలంలో జరిపే దేశీయ ప్రయాణాలకు ఈ ఆఫర్ వర్తిస్తుందని వివరించింది.