బిజినెస్

విద్యుత్ బకాయిలు చెల్లించిన రిలయన్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 3: మహారాష్ట్ర సర్కారుకు 2,640 కోట్ల రూపాయల విద్యుత్ బకాయిలను మహారాష్ట్ర సర్కారుకు రిలయన్స్ ఇఫ్రా లిమిటెడ్ (రిల్) చెల్లించింది. అదానీ ట్రాన్స్‌మిషన్ లిమిటెడ్‌తో ముంబయి అంతర్గత విద్యుత్ సరఫరా వ్యాపార లావాదేవీలు ముగిసిన నేపథ్యంలో, రిల్ ఈ మొత్తాన్ని చెల్లించింది. ఒప్పందం ప్రకారం 13,800 కోట్ల రూపాయలుగా ఉన్న రుణ భారం నుంచి రిల్ ఇప్పుడు పూర్తిగా బయటపడింది. 2019 సంవ్సరాంతానికి 5,000 కోట్ల రూపాయలు సంస్థలోకి వస్తాయని అంచనా వేస్తున్నది.
ఎన్‌హెచ్‌ఏఐపై కేసు గెలుపు: నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్‌హెచ్‌ఏఐ)పై వాజ్యాన్ని రిల్ గెల్చుకుంది. ముగ్గురు సభ్యులతో కూడిన మధ్యవర్తిత్వ ట్రిబ్యునల్ ఏకగ్రీవంగా తీర్పును వెలువరించింది. 2018 నవంబర్ 29వ తేదీలోగా 150 కోట్ల రూపాయలను రిల్‌కు చెల్లించాలని ఎన్‌హెచ్‌ఏఐని ఆదేశించింది. అంతేగాక, సకాలంలో ఈ మొత్తాన్ని ఇవ్వలేకపోతే, ఏడాదికి 12 శాతం చొప్పున వడ్డీని కూడా చెల్లించాలని ట్రిబ్యునల్ తన తీర్పులో పేర్కొంది.