బిజినెస్

పైకి ఎగసి.. కుప్పకూలి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: ఆరంభంలో అద్భుతంగా ఎగిసిన స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ చివరిలో హఠాత్తుగా కుప్పకూలడంతో భారీ నష్టాలతో సోమవారాన్ని ముగించింది. సస్సెక్స్ 332 పాయింట్లు నష్టపోగా, నిఫ్టీ 98 పాయింట్లు పతనమైంది. దేశీయ స్థూల ఉత్పత్తి (జీడీపీ) గత రెండేళ్ల గరిష్టానికి చేరిందన్న వార్తలతో సోమవారం ఉదయం స్టాక్ మార్కెట్ ఉత్సాహంగా ప్రారంభమైంది. మధ్యాహ్నం తర్వాత కూడా బుల్ రన్ కొనసాగడంతో, భారీ లాభాల్లో ముగిసే అవకాశాలు కనిపించాయి. కానీ, డాలర్‌కు రూపాయి మారకపు విలువ రికార్డు స్థాయిలో పడిపోవడంతో, చివరి గంటల్లో షేర్ల అమ్మకాలు భారీగా పెరిగాయి. దీనితో లాభాలతో ముగుస్తుందనుకున్న షేర్ మార్కెట్ ఒక్కసారిగా పతనమై, ఏకంగా 332 పాయింట్లు నష్టపోయి, 38,312 పాయింట్ల వద్ద స్థిరపడింది. 98 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ 11,582 పాయింట్ల వద్ద ముగిసింది. కాగా, రెడ్డీ లాబ్స్, విప్రో, ఇచర్ మోటర్స్, టైటాన్, హిందుస్థాన్ పెట్రోలియమ్ సోమవారం లాభపడిన కంపెనీల్లో ఉన్నాయి. హిందుస్థాన్ లీవర్, పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ తదితర కంపెనీలు నష్టాలను చవిచూశాయి. ఇటీవల కాలంలో లాభాల్లో ముగుస్తున్న స్టాక్ మార్కెట్‌లో పతనం ఆరంభం కావడంతో ఈ వారంతంలో ఏదైనా జరగవచ్చన్న ఆందోళన మదుపురుల్లో కనిపిస్తున్నది.