క్రీడాభూమి

తట్టుకోలేకున్నాం..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 3: ఆసియా గేమ్స్‌లో స్వర్ణం సాధించలేకపోయామన్న బాధకు, అక్కడ సాధించిన కాంస్యమో, పాకిస్తాన్‌పై విజయమో విరుగుడు కాదని భారత హాకీ కెప్టెన్ పిఆర్ శ్రీజేష్ వ్యాఖ్యానించాడు. నిర్ణీత సమయంలో మ్యాచ్ ఫలితం తేలకపోవడంతో, షూటాఫ్‌కు వెళ్లిన సెమీఫైనల్స్ మ్యాచ్‌లో మలేసియా జట్టుపై భారత్ ఓటమి తెలిసిందే. డిఫెండింగ్ చాంపియన్‌గా, ప్రపంచ ఐదో ర్యాంకర్‌గా ఆసియా బరిలోకి దిగిన హాకీ జట్టు లీగ్ మ్యాచ్‌ల్లో అద్భుతమైన పాటవాన్ని ప్రదర్శించి 76 గోల్స్‌తో పేవరేట్‌గా స్వర్ణంపై అంచనాలు పెంచింది. స్వర్ణం ఖాయమనుకున్న జట్టుకు సెమీఫైనల్స్‌లో ఎదురుదెబ్బ తగలడంతో భారత హాకీ ఖ్యాతి మసకబారడమే కాదు, కెప్టెన్ శ్రీజేష్ తీవ్ర నిరాశకు గురయ్యాడు. ‘మా ఆవేదనలో ఎలాంటి సందేహం లేదు. ఈ ఏడాదిలోనే ఆసియా క్రీడల్లో మా ప్రదర్శన అత్యద్భుతం. అయినా ఓటమి ఎదురవ్వడంతో ఆటగాళ్లంతా షాక్ తిన్నాం. పాక్‌పై విజయంతో సాధించిన పతకం కేవలం కన్సొలేషన్ కాంస్యమే. అది మా బాధను ఏమాత్రం మాన్పలేదు’ అని శ్రీజేష్ వ్యాఖ్యానించాడు. ఆసియా గేమ్స్‌లో స్వర్ణం సాధించడం ద్వారా వచ్చే ఒలింపిక్‌కు బెర్త్ ఖాయం చేసుకోవాలనుకున్న భారత్ ఆశలు అడియాసలయ్యాయి. దీనిపై శ్రీజేష్ స్పందిస్తూ ‘ఒలింపిక్స్‌లో అర్హత సాధించడానికి ఆసియా గేమ్స్ ఒక అవకాశం మాత్రమే. అదే చివరిది కాదు. అర్హత సాధించడానికి ఇంకా చాలా అవకాశలే ఉన్నాయి. వాటిని సాధించగలమన్న నమ్మకం నా జట్టుకు బలంగా ఉంది’ అన్నాడు. ‘ఆసియా గేమ్స్ నుంచే ఒలింపిక్‌కు అర్హత సాధించే సామర్థ్యమున్న జట్లలో భారత్ ఒకటి. కానీ సాధించలేకపోయాం’ అని శ్రీజేష్ వ్యాఖ్యానించాడు.