క్రీడాభూమి

త్వరలో కుక్ గుడ్ బై

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, సెప్టెంబర్ 3: ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్, టెస్ట్ క్రికెట్‌లో ఇంగ్లాండ్ జట్టులోనే అత్యధిక పరుగులు సాధించిన అలిస్టర్ కుక్ త్వరలో అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పనున్నాడు. భారత్‌తో ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా చిట్టచివరిదైన ఐదో టెస్ట్ మ్యాచ్ పూరె్తైన వెంటనే రిటైర్మెంట్ ప్రకటించనున్నాడు. 33 ఏళ్ల కుక్ 161 టెస్టుల్లో 12,254 పరుగులు చేశాడు. 32 శతకాలు, 56 అర్ధ శతకాలు సాధించాడు. 2011లో భారత్‌తో సిరీస్‌లో భాగంగా బర్మింగ్‌హామ్‌లో ఆడిన మ్యాచ్‌లో 294 పరుగులు సాధించి, అత్యధిక టెస్ట్ స్కోర్ నమోదు చేశాడు. భారత్‌తో తాజా సిరీస్‌లో ఏమాత్రం ఫాం ప్రదర్శించలేకపోయిన కుక్, ఏడు ఇన్నింగ్స్‌లో కేవలం 109 పరుగులే సాధించడం గమనార్హం. ‘కొద్ది నెలలుగా తీవ్రంగా ఆలోచించిన మీదట అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాలని కుక్ నిర్ణయించుకున్నాడు. భారత్‌తో జరగనున్న చివరి టెస్ట్ పూరె్తైన వెంటనే నిర్ణయాన్ని ప్రకటిస్తాడు’ అని ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు తన ప్రకటనలో పేర్కొంది. ‘పెదాలపై చిర్నవ్వు చెరగకుండా ఇంగ్లాండ్ క్రికెట్ కోసం సర్వం ధారపోశాను. నేనూహించనదానికంటే ఎక్కువ స్థాయికే చేరాను. సుదీర్ఘకాలం ఆడటం అదృష్టమే కానీ, డ్రెస్సింగ్ రూంకు దూరమవ్వడం బాధాకరం’ అని కుక్ పేర్కొన్నాడు.