అంతర్జాతీయం

పాక్ అధ్యక్ష ఎన్నిక నేడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లామాబాద్: పాకిస్తాన్ కొత్త అధ్యక్షుడి ఎన్నికల మంగళవారం జరుగనుంది. ప్రస్తుత పాలకవర్గ పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పీటీఐ) అభ్యర్థి ఆరిఫ్ అల్వీకే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రతిపక్ష పార్టీల తరఫున అధ్యక్ష పదవి కోసం అభ్యర్థులను ఎవరినీ నిలబెట్టకపోవడంతో ఆరిఫ్ అల్వీనే దేశ కొత్త అధ్యక్షుడిగా ఎన్నికయ్యే అవకాశాలు దాదాపు ఖాయమైనట్టే. అధ్యక్ష పదవి కోసం పాక్ ఎన్నికల కమిషన్ (ఈసీపీ) సోమవారం సన్నాహాలు పూర్తి చేసింది. జాతీయ అసెంబ్లీతోపాటు నాలుగు ప్రొవిన్షియల్ అసెంబ్లీలలో సైతం పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసింది. చీఫ్ ఎన్నికల కమిషనర్ సర్దార్ రజా ఖాన్ అధ్యక్ష ఎన్నికకు రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తారు. ప్రస్తుత దేశాధ్యక్షుడు మమ్‌నూన్ హుస్సేన్ పదవీకాలం ఈనెల 8వ తేదీతో ముగుస్తుంది. మళ్లీ రెండోసారి అధ్యక్షుడు కావాలన్న మమ్‌నూన్ హుస్సేన్ ఆశలకు గండిపడింది. కాగా, పీటీఐ పార్టీ అభ్యర్థి అల్వీతోపాటు పాకిస్తాన్ పీపుల్స్ పార్టీకి చెందిన చౌదరి అయితాజ్ హాసన్, జమీయత్- ఇ- ఉలేమా (ఎఫ్) చీఫ్ వౌలానా ఫజల్-ఉర్-రహ్మాన్ కూడా అధ్యక్ష పదవి రేసులో ఉన్నారు. ఇదిలావుండగా, దేశ కొత్త అధ్యక్షుడిగా ఎన్నిక కాబోతున్న కరాచీకి చెందిన అల్వీ వృత్తిరీత్యా డెంటల్ డాక్టర్.