అంతర్జాతీయం

భారత్‌లో పెట్టుబడులు పెట్టండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నికోసియా, సెప్టెంబర్ 3: డిజిటలైజేషన్, స్మార్ట్ సిటీస్, వౌలిక సదుపాయాలు, పర్యాటకం వంటి రంగాల్లో త్వరితగతిన అభివృద్ధి చెందుతున్న భారత్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని సైప్రస్ వ్యాపారవేత్తలకు రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్ పిలుపునిచ్చారు. సైప్రస్ పర్యటనలో భాగంగా రాష్టప్రతి ఇక్కడి పార్లమెంటులో సోమవారం ప్రతినిధులను ఉద్దేశించి ప్రసంగించారు. భారతదేశ ఆర్థిక ప్రగతి మరింత ముందుకు దూసుకుపోయేందుకు పెట్టుబడులను ఆహ్వానిస్తున్నట్టు ఆయన తెలిపారు. ఇప్పటికే భారత్‌తో ద్వైపాక్షిక వాణిజ్యం కోసం పెట్టుబడులు పెట్టిన దేశాల్లో ఎనిమిదో స్థానంలో నిలిచిన సైప్రస్ 8.2 బిలియన్ డాలర్లతో ఎనిమిదో స్థానంలో నిలిచిందని ఆయన అన్నారు. డిజిటల్ ఇండియా మిషన్, స్మార్ట్ సిటీస్ మిషన్, వౌలిక సదుపాయాల కల్పనలో అగ్రగామిగా ఉండడంతోపాటు విద్యుత్, శక్తి, జాతీయ రహదారులు, పోర్టులు, షిప్పింగ్ వంటి విభాగాల్లో భారత్ ప్రగతిపథంలో ముందుకు దూసుకుపోతున్న విషయాన్ని రాష్టప్రతి ప్రస్తావించారు. అంతేకాకుండా పర్యాటరంగాన్ని విస్తృతంగా అభివృద్ధిపరచడంతోపాటు వీసా నిబంధనలను సరళతరం చేయడం, వౌలిక వసతులను, సదుపాయాలను మరింత అభివృద్ధి చేసే దిశగా భారత్ పెట్టుబడిదారులను మరింత ప్రోత్సహిస్తోందని ఆయన అన్నారు. ఈ నేపథ్యంలో భారత్ వాణిజ్య, వ్యాపార రంగంలో మరింత దూసుకువెళ్లేందుకు వీలుగా సైప్రస్ భాగస్వామి కావాలని ఆయన అభిలషించారు. ఇందులో భాగంగా పెట్టుబడిదారులు, వాటాదారులు తమ బ్రాండ్ ఉత్పత్తులను అమ్మడం లేదా కొనుగోలు చేయడానికి ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. ‘్భరత్‌లో వ్యాపారానికి ద్వారాలు తెరిచే ఉన్నాయి. సైప్రస్‌కు ఇదే ఆహ్వానం’ అని రాష్టప్రతి వ్యాఖ్యానించారు.

చిత్రం..మూడు దేశాల పర్యటనలో భాగంగా సైప్రస్ సందర్శించిన రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్ సోమవారం
ఆ దేశ అధ్యక్షుడు నికోస్ అనస్టాసియాడిస్‌తో చర్చలు జరుపుతున్న దృశ్యం