సబ్ ఫీచర్

నవగ్రహాల దర్శనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘నవగ్రహాలనేవి నక్షత్రాల, రాశులపై అధిపతులని జ్యోతిష్య శాస్తమ్రు చెప్తుంది. మనుషులకు జీవనములో ఏదైనా తేడాలొచ్చినా, ఒడుదుడుకులు ఏర్పడినపుడు గ్రహగతులు బాగులేవని గ్రహశాంతి చేయాలని పెద్దలు చెప్తారు. ఆ విధంగా గ్రహశాంతి చేయించడం చేస్తారు. తమ ప్రాంతాల్లో ఏవైనా దేవాలయాల్లో నవగ్రహాలున్నట్లు అయితే వాటిని దర్శించడం చేస్తూంటారు.
‘‘నవగ్రహాలను కొన్ని దేవాలయాల్లో స్థాపిస్తూ ఉంటారు, కాని తమిళనాడులో, తంజావూరు జిల్లా కుంభకోణానికి 60 కి.మీ. దూరంలో నవగ్రహాలున్నాయి. ఈ దేవాలయానికి తొలి ప్రాధాన్యము సూర్యదేవాలయానికే! ప్రత్యక్షదైవం సూర్యునిగా అందరూ భావిస్తారు కదా!
‘‘మొట్టమొదటిగా అందరూ. ఈ దేవాలయాలకు దగ్గరలో తిరుమంగళక్కుడి ప్రాణనాదేశ్వరుని ఆలయం ఉంది. ముందుగా ఈ ఆలయాన్ని దర్శించుకోవాలంటారు.
‘‘ప్రాణనాదేశ్వరుని దర్శనానంతరం సూర్య దేవాలయంలో ఉన్న వినాయకునికి పూజ, దర్శనం చేసుకుంటారు. ప్రత్యక్ష దైవమైన సూర్యనారాయణుని తన భార్యలైన సంధ్య, ఛాయలతో మనకు దర్శనమిస్తారు. సూర్యదేవునికి అభిముఖంగా దేవగురువు బృహస్పతి మనకు దర్శనమిస్తారు.
‘‘ఆలయ అంతర్భాగాన నవగ్రహాలచే ప్రతిష్టింపబడిన కాశీవిశే్వశ్వరస్వామి, విశాలాక్షమ్మ విగ్రహాలున్నాయి. ఈ విషయం నిర్ధారిస్తున్నట్లు వినాయకుని విగ్రహం ఉంది. నవగ్రహాలను దర్శించుకోడానికి ఒక పద్ధతి కూడా ఉంటుందంటారు.
‘‘నవగ్రహాల్లో ముందుగా సూర్యుణ్ణి, గురుడుని దర్శించుకుంటారు. గురుడి విగ్రహం ప్రక్క ద్వారంగుండా వెలుపలికి రావాలి. ఇతర గ్రహాలను ప్రదక్షిణంగా దర్శించుకోవాలంటారు.
ఇతర గ్రహాలు శనైశ్చరుడు, బుధుడు, అంగారకుడు, (కుజుడు) చంద్రుడు, కేతువు, శుక్రుడు, రాహువు వీరిని దర్శించుకోవాలని అంటారు.
‘‘నవగ్రహాల దర్శనానంతరం అక్కడే ఉన్న చండికేశ్వరుని దర్శనం చేసుకుంటారు. నవగ్రహాల దర్శనం తరువాత ప్రదక్షిణంగా గర్భాలయ వెనుకలోనున్న వినాయకుణ్ణి మరల దర్శించుకుంటారు.
గ్రహగతులు ప్రతి నిత్యం అనుక్షణం జరుగుతూ ఉంటుందంటారు. గ్రహస్థితులను మనిషి పుట్టిన నక్షత్రం- దానినిబట్టి సాధారణ ఉచ్ఛస్థితులు బాగులేని స్థితులు జరుగుతూ ఉంటాయి.
‘‘సకల దేవతల దర్శనం సర్వులు చేస్తూంటారు. నవగ్రహాల ఆలయ దర్శనం నవశాంతి జీవనానికై పరమశాంతిదాయకం. అత్యంత శుభప్రదం.
తమిళనాడులో కుంభకోణమునకు రైలు సదుపాయాలు ఉన్నాయి. రైలు, బస్సు, ఇతర రవాణా సౌకర్యాలు కూడా ఈ నవగ్రహాలకు ఉన్నాయి.
‘‘108 మంగళా శాసన దివ్య దేశములు మన దేశంలోనే ఉన్నాయి. వాటిలో ‘నవ తిరుపతులని’ తొమ్మిది ఉన్నాయి. వీటినే నవగ్రహ క్షేత్రాలని కూడా అంటారు. ఇవి కూడా తమిళనాడు రాష్ట్రంలో తిరునల్వేలి జిల్లాలో ‘‘పవిత్ర తామ్రపర్ణి’’ నదికి రెండువైపులా ఉన్నాయి. భాగవతోత్తములైన 12 మంది ప్రసిద్ధ ఆళ్వారులలో ఒకరైన ‘‘శ్రీ నమ్మాళ్వారులచే’’ ఈ నవ తిరుపతులను మంగళాశాసనము చేయబడినవి.
గ్రహాల దోషములున్నవారు ఈ నవ తిరుపతులను దర్శించుకుంటే ఆయా క్షేత్రాలలో ఉన్న శ్రీమన్నారాయణుని దర్శించుకుంటే గ్రహదోషములు పోవునని భగవంతుని అనుగ్రహం పొందుదురని అంటారు. అక్కడ శ్రీమన్నారాయణుని పేర్లు.
(54) (1) శ్రీ వైకుంఠం - (సూర్యుడు) వైకుంఠనాథన్
(55) (2) తిరువరగుణమంగై (చంద్రుడు) నత్తమ్, విజయాసవర్
(58) (3) తిరుక్కోళూరు- (కుజుడు) వైత్తమావిని
(52) (4) తిరుప్పళింగుడి (బుధుడు) కాయశిననేన్దన్
(49) (5) తిరుక్కురుగూర్ (గురుడు) ఆదినాధన్
(53) (6) తెన్ తిరుప్పేర్ (శుక్రుడు) మకరనెడు కంకుళక్కాదన్
(56) (7) తిరుక్కుళందై (శని) మాయాక్కూతన్
(50) (8) (9) తిరుత్తువైవిల్లి మంగళమ్ రాహువు, కేతువు దేవసిరాన్, అరవింద లోచనన్.
గ్రహదోషాలున్నవారు అనుకున్న పనులు జరగకపోయినా, స్థితిగతులు, ఇబ్బందులుగానున్న గ్రహాల గమనం వలననే జ్యోతిష్కులు భావిస్తూంటారు. వాటి అనుకూలతలకు నవగ్రహ పూజలు చేయమని చేయించమని చెప్తూంటారు. అందుకే గ్రహదోషాలున్నవారు 108 దివ్య దేశాలలో ఉన్న ‘నవ తిరుపతులను’ దర్శించుకుని అక్కడున్న ‘గ్రహాల సందర్శనం’ నారాయణుని దర్శనం, సేవిస్తే సమస్త గ్రహాల దోషాలు తొలగిపోతాయని చెప్తారు.

-ఎ.ఎస్.నాగభూషణశర్మ