నేర్చుకుందాం

నేర్చుకుందాం( దాశరథి శతకం )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చ.సిరులిడ సీత, పీడలెగఁజిమ్ముటకున్ హనుమంతుఁడార్తిపోఁ
దరుమ సుమిత్రసూతి, దురితంబులు మానుప రామనామమున్
గరుణదలిర్ప, మానవులఁ గావఁగఁ బన్నిన వజ్రపంజలో
త్కరముగదా భవన్మమహిమ, దాశరథీ కరుణాపయోనిధీ

భావం: ఓ దశరథరామా, ఓ దయా సముద్రమా, నిన్ను సేవించు మానవులకు సిరిసంపదలను అందించడానికి సీతాదేవి ఉన్నది. బాధలను తొలగించడానికి నీ భృత్యుడైన హనుమంతుడున్నాడు. సంకటాలు వచ్చినప్పుడు, వాటిని తరిమివేయటానికి లక్ష్మణమూర్తి ఉన్నాడు. పాపాలను నిర్మూలించడానికి నీ నామమున్నది. పక్షులను వజ్రపుగూండ్లు కాపాడినట్లుగా నీ మాహాత్మ్యము భక్తులైన మానవులను రక్ష చేస్తుంది.

వ్యా: కంచెర్ల గోపన్న కవి, భద్రాచలంలో నివసించి ఉండే శ్రీసీతారామ లక్ష్మణులు తమ భక్తులైన మానవులను ఏ విధంగా కాపాడుతారో, ఒక్కొక్కరు తమ విధులను తమ భక్తుల పట్ల నిర్వహిస్తారో ఈ పద్యంలో చెబుతున్నాడు.
శ్రీమహావిష్ణువు దశరథ మహారాజు కుమారుడుగా అవతరించినాడు. విష్ణుమూర్తి మానుష లోకానికి వచ్చినప్పుడు శ్రీ మహాలక్ష్మి సీతాదేవి రూపంలో జనక మహారాజు కుమార్తెగా అవతరించి, శ్రీరాముని వరించి వివాహం చేసికొన్నది. వైకుంఠంలో అనునిత్యం సేవ చేసి, విష్ణుమూర్తిని మెప్పించే ఆదిశేషుడు లక్ష్మణమూర్తిగా అవతరించి, మానుష జన్మలోను శ్రీరాముని సేవ చేసి తన విద్యుక్త ధర్మాన్ని నిర్వహించినాడు. దేవతలు వానర రూపాల్లో జన్మించి శ్రీరాముని అనుసరిస్తామన్నారు కదా. హనుమంతుడు అటువంటివాడే. భద్రాచలంలో ఉండే శ్రీ సీతారామ లక్ష్మణులు, హనుమంతుడు నరవానరుల వంటి స్వరూపాలు కలిగిన వారైనప్పటికీ వారి మహిమలు ఇట్టివని వాల్మీకి రామాయణం వక్కాణిస్తున్నది.