Others

గురుభ్యోనమః

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పసితనపు అజ్ఞానాన్ని వెలుగు అక్షరాలతో
చీకటిని పారద్రోలుతూ
ముందుతరాలకు సూచిక అవుతాడు
తల్లిదండ్రుల స్థానాన్ని భర్తీచేస్తూ
చిటికెన వేలు పట్టుకొని నీ గమ్యానికి
బాటసారిలా తోడుంటాడు
చదువురాని వాడివని దిగులు చెందకు
మనసుంటే మార్గముంటుందని
వెన్నుతట్టే ఒకానొక ప్రోత్సాహం
నువ్వెంత ద్వేషించినా రెట్టింపు ప్రేమతో
నిన్ను వదిలిపెట్టని నేస్తం.
నీ వంటి మీద పడిన దెబ్బలన్ని
ప్రగతి సోపానికి రథసారథులే
తండ్రిలా ప్రేమని
తల్లిలా ఆకలిని
స్నేహితుడిలా, సోదరుడిలా
వెన్నంటి ఉంటూ
భిన్నపాత్రల్లో వొదిగిపోతూ
నీలోని ‘మనిషితత్త్వాన్ని’ మేలుకొల్పే
ఒకానొక చైతన్య వీచిక
భవిష్యత్‌కు పునాదిరాళ్ళని
నీచే వేయిస్తూ సామాజిక బాధ్యతని మరువని
గొప్ప సంస్కర్త
జ్ఞానాన్ని పంచే గురువులకి
జన్మంతా రుణపడి ఉంటాం

(ప్రేమనే తప్ప ఇంకేమి ఆశించని గొప్ప గురువులకి ఉపాధ్యోయ దినోత్సవ శుభాకాంక్షలు)

-పుష్యమీ సాగర్ 90103 50317