Others

ప్రోత్సాహంతోనే అందలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మా ఇంట్లో నేను చివరి అమ్మాయిని. పైగా నాకు ముందు దంతాలు సకాలంలోరాలేదు. దానితో నేను ముద్దుముద్దుగా మాట్లాడేదానిని. మా ఇంట్లో, మాస్కూల్ హాలెండ్ మిషనరీ సెయిట్ జోసెఫ్ గర్స్ల్ పాఠశాల అందులోని ఉపాధ్యాయులు నన్ను గారాబం చేసేవారు.
అదీ ఇదీ కలసి నేను చదువులో వెనుక బడిపోయాను. కానీ నాకు మంచిమార్కులు తెచ్చుకోవాలని ఉండేది.
ఒకరోజు మా ప్రేమలీలా టీచర్ సాంఘిక పాఠాలు చెప్పేవారు. వారువచ్చి రాగనే పరీక్షా పత్రాలను మాకు ఇస్తూ మార్కులు చెబుతున్నారు. శ్యామలాదేవిని అభినందించండి. 68 మార్కులు వచ్చాయి అన్నారు. నా చెవులను నేను నమ్మలేకపోయాను. అందరూ చప్పట్లు కొడుతున్నారు. కానీ నేను ఉన్నచోట ఉండిపోయాను. ‘అమ్మా శ్యామలా వచ్చి పేపర్ తీసుకో’ అన్నారు మా ప్రేమలతా టీచర్.
అంతే అదే నా జీవితంలో నా చదువులో గొప్ప మలుపు.
నాటి నుండి నేటిదాకా చదువులో నేనే మొదటి ర్యాంకునే సాధిస్తున్నాను. అంతేకాదు వక్తృత్వ పోటీల్లోను, నాట్యం, చిత్రలేఖనం ఇలా అన్నింటిలోనే నేనే ప్రథమురాలిగా మారిపోయాను. నాలో ఇంత మార్పు కేవలం మా ప్రేమలీలా టీచర్ చేశారు. కొద్ది ప్రోత్సాహం. ఆరోజు నన్ను దగ్గరకు పిలిచి తప్పక నీవు ఇంకా ఎక్కువ మార్కులు సాధించగలవు. నీలో ఆ శక్తి ఉంది. ప్రయత్నించి చూడు. తప్పక నీకు మొదటిస్థానం వస్తుంది అన్నారు. ఆ మాటలే నాలో మారుమ్రోగుతూ ఉండేవి.
నన్ను ఇంతగా అభిమానించి నా పాఠశాల, కళాశాల జీవితానికి గొప్ప పునాది వేసిన మా ప్రేమలీల టీచర్‌కు ఏమిచ్చి ఋణం తీర్చుకోగలను?
అలా ప్రతి గురువు ప్రతిభ కొరవడి శ్రద్ధాసక్తులు చూపలేని విద్యార్థులను సగటు కన్నా తక్కువ ప్రమాణాలున్న వారిని కొద్దిగా పెంచుతూ ప్రోత్సాహం కలిగిస్తే వారు కూడా అందరితో ధీటుగా ఎదగగలరు. నేనే స్వయంగా ఉపాధ్యాయునిగా ఈ ప్రయోగం చేసి కొందరినయినా ప్రగతి మార్గంలోకి త్రిప్పగలిగానన్న తృప్తి ప్రేమలీలగారి అడుగుజాడల్లో నడిచినందునందుకు పొందాను.
దిజ్పళ ఘ ష్ద్ఘశషళ ఆ్య ఘ ౄళజూజ్యషూళ ఒఆఖజూళశఆ.. అనే శీర్షిక పైన నేను బిఎడ్ కళాశాల ప్రిన్సిపాలుగా ‘ఉ్ళ్హఉ్గ డశ్రీ--్జ్గ’’ అనే .్ళ.ఉ.్గ.. బెంగళూరు వారు నిర్వహిస్తున్న సంచికకు పంపితే నా ఆర్టికల్ పదిమంది ఎంపిక చేయబడిన వారి వ్యాసాల్లో నా వ్యాసం డైరెక్టర్ మహేశ్వరి , వాసుదేవ్, ఆర్కే లక్ష్మణ్ గార్ల వ్యాసాలతో ప్రచురించబడి ప్రశంసల పరంపర నందుకున్న దంటే ఆ కీర్తి ప్రేమలీలటీచర్ గారిది.
‘‘వెయ్యి మైళ్ల ప్రయాణమైనా చిన్న అడుగుతోనే మొదలవుతుంది’’ అలా చిన్న విజయంలో ఆనందం మిన్న! మనమే కాదు మన తల్లిదండ్రులు, స్నేహితులు, మన పాఠశాల కూడా గర్వించేలా త్రికరణ శుద్ధిగా మనం పురోగతిని, లక్ష్యసిద్ధికి సంకల్పించినపుడు మన మానసిక బలం పెరిగి మనం మరింతగా శ్రమిస్తూ ఈ పోటీ ప్రపంచంలో స్థానాన్ని పొందగలుగుతాము.
ఇలాంటి మార్పులతో నాలో ఒక లక్ష్యం. సాధనకు పట్టుదల కూర్చిన మా ప్రియతమ గురువు మూలంగా నేను సాంఘిక శాస్త్రం ఇంగ్లీషు ఉపాధ్యాయునిగా ‘ఉత్తమ ఉపాధ్యాయ అవార్డ్’, ‘ఆదర్శ ఉపాధ్యాయిని‘గా అంతకన్నా ఘనంగా ‘జీవిత సాఫల్య పురస్కారా’న్ని అందుకున్నానంటే అదంతా కేవలం మా ప్రేమలీలా టీచర్ అభిమానమే.
మా ప్రేమలీలా టీచర్‌గా చదువుమీద శ్రద్ధలేని నాలో మార్కులు ఎరగా చూపి మార్గదర్శకులయ్యారు. ఆమె ఈలోకంలో లేరు. ఆమెకు నా నివాళులు. ఈ వ్యాసరూపంలో ఆమెకు చిరునూలుపోగు గురుదేవో భవా

-పరిమి శ్యామలాదేవి విశ్రాంత ఎడ్ కళాశాల ప్రిన్సిపాల్ మదనపల్లె, 9440034545