సబ్ ఫీచర్

జీర్ణ సమస్యలు- యోగాసనాలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రతిరోజు యోగాసనాలు చేస్తుంటే శారీరానికే కాక మనస్సుకు కూడా ప్రశాంతత లభిస్తుంది. ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. ఆహ్లాదకరమైన మనస్సు ఉంటే కష్టమైన పనులు కూడా త్వరగా సులువుగా చేసేయొచ్చు. అట్లాంటివి కొన్ని చూద్దాం.
మలబద్ధకంతో బాధపడేవారు ఈ మధ్య ఎక్కువగా ఉంటున్నారు. ఆయాసం, అజీర్ణం లాంటి సమస్యలకు యోగాసనాలు చక్కని ఉపశమనం కల్గిస్తాయి.
ముందుగా చాప మీద మడిమలపై కూర్చోండి. మెల్లగా ముందుకు సాగండి. ఛాతీని తొడలకు ఆనుకునేవరకు తీసుకొని రండి. చేతులు ముందుకు చాపుతూ నుదురు నేలకు తాకేట్టుగా పడుకోండి.
ఒక్క నిముషం ఆగి మెల్లగా అరచేతులు, అరికాళ్లు నేలకు అంటుకుని ఉండేలా చేస్తూ మెల్లగా పైకి లేవండి. ఇలా చేసేటపుడు మీ వెన్నుముక వంగకుండా చూసుకోండి. ఇలా శరీరాన్ని పైకి లేపుతూ కిందకు వంచుతూ 4,లేక 5 సార్లు చేయండి. ఒత్తిడి లేకుండా మెల్లగా ఈ ఆసనం వేస్తూ ఉన్నందువల్ల మీకు జీర్ణసమస్యలు తగ్గుముఖం పడుతాయి.
ఇంకొందరికి కడుపులో, గుండెలో మంటగా అనిపిస్తుంటుంది. ఇది తగ్గడానికి కూడా మంచి ఆసనాలు యోగాభ్యాసంలో మనకు కనిపిస్తాయి.
ముందుగా మీరు యోగాసనం వేయడానికి గోడకు అభిముఖంగా కూర్చోండి. మెల్లంగా తలను, వీపును నేలపైనే ఉంచుతూ కాళ్లను గోడకు చేర్చండి. మెల్లమెల్లగా గోడ సపోర్ట్‌తో కాళ్లను పూర్తిగా పైకి లేపండి. ఇలా రెండు నిముషాలుంచి తిరిగి మామూలుగా వచ్చేయండి. తిరిగి ఈ ఆసనాన్ని వేయండి.ఇలా రోజుకు 5,6 సార్లు చేస్తూ ఉంటే మెల్లమెల్లగా మీ కడుపులోను, గుండెల్లోను మంట తగ్గిపోతుంది.
మీరు చాపమీద వెల్లకిలా పడుకోండి. ఒక్కనిముషం ఒత్తిడి లేకుండా ఉండండి. మెల్లమెల్లగా నడుము భాగాన్ని లేపండి. ఇలా లేపేటపుడు కాళ్లు మోకాళ్లదాకా నిలువుగా ఉంచండి. తలను నేలపై ఆన్చి ఉంచండి. చేతులను నడుము దగ్గర పెట్టుకోండి. ఇలా చేసి రెండు నిముషాలు ఈ పొజిషన్‌లోనే ఉంచండి. మెల్లగా యథాస్థితికి రండి.
ఈ ఆసనాన్ని రోజుకు 5,6 సార్లు వేస్తూ ఉంటే మలబద్దక సమస్య తగ్గిపోతుంది. స్ర్తిలకు ఈ ఆసనాలు మంచి శక్తిని ఇస్తాయి.

- సి. వెంకట లక్ష్మి