7న ప్రేమకు రెయిన్‌చెక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘రెయిన్ చెక్’ అంటే ఇచ్చిన ఆఫర్‌ను భవిష్యత్‌లో తీసుకుంటాను అని అర్థం. ప్రముఖ నిర్మాణ సంస్థ నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సమర్పణలో స్టోన్ మీడియా ఫిలిమ్స్ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం ‘ప్రేమకు రెయిన్‌చెక్’. ఆకెళ్ళ పేరి శ్రీనివాస్ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న ఈ ట్రెండీ లవ్ స్టోరీని నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత శరత్‌మరార్ సమర్పిస్తుండడం విశేషం. అభిలాష్ వాడ్డ, ప్రియా వడ్లమాని, వౌనికా తతవనం హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈనెల 7న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో హీరో అభిలాష్ మాట్లాడుతూ.. ‘నా తొలి సినిమా ఇది. మా టీమ్‌కు ఈ సినిమా ఒక డ్రీమ్. మా వర్క్ ఏంటనేది ఇప్పటికే ట్రైలర్‌లో చూశారు. మా టీమ్ అందరం ది బెస్ట్ ఔట్‌పుట్ వచ్చేలా ప్రేమకురెయిన్‌చెక్‌కు వర్క్ చేశాం. కార్పొరేట్ లవ్‌స్టోరీ ఎవ్వరినీ డిజప్పాయింట్ చెయ్యదు. మా వర్క్ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాం అన్నారు. ‘హీరోయిన్ ప్రియా, వౌనిక మాట్లాడుతూ.. ‘దర్శకులు ఆకెళ్ల పేరి శ్రీనివాస్‌గారు చాలా క్లారిటీగా ఈ సినిమా చేశారు. సినిమాలో ప్రతి పాత్ర బ్యూటీఫుల్‌గా ఉంటుంది. సినిమా అందరికీ నచ్చుతుందన్నారు. సంగీత దర్శకులు దీపక్ కిరణ్ మాట్లాడుతూ.. ‘ఈ చిత్రం పాటలని ప్రోత్సహించినందుకు ప్రేక్షకులకి ధన్యవాదాలు. చిత్రంలో విజువల్స్, కథ, కథనం ప్రకారం ఫ్రెష్ బ్యాగ్రౌండ్ స్కోర్‌తో మీ ముందుకు ‘ప్రేమకు రెయిన్ చెక్’ రాబోతుంది. మీ అందరి మెప్పు పొందుతుందని ఆశిస్తున్నాం’ అని తెలిపారు. ఆకెళ్ల పేరిశ్రీనివాస్ మాట్లాడుతూ.. ‘ఎడ్వెంచర్ స్పోర్ట్స్ ఆఫీస్ నేపథ్యంలో నడిచే సినిమా ఇది. లవ్, అడ్వెంచర్, పెయిన్, ఫన్ ఇలా అన్నీ అంశాలు ఈ సబ్జెక్ట్‌లో ఉంటాయి. రియల్‌గా అడ్వెంచర్ మా నటీనటులు చేయటం విశేషం. ఈ చిత్రంలో కథాకథనంతోపాటు ముఖ్యంగా ఆకట్టుకునే అంశాలు- లార్జర్ థన్ లైఫ్ ఎక్స్‌పీరియన్స్ ప్రేక్షకులని అలరిస్తుందని భావిస్తున్నాం’ అని తెలుపుతూ ‘స్టోన్ మీడియా ఫిల్మ్స్ ఆండీ కోహెన్ మరియు అతని సంస్థ కోసం ఒక ప్రత్యేక ప్రదర్శనను ఏర్పాటుచేశాం. మా సినిమా చూసి నచ్చి అంతర్జాతీయ భాషలలో చిత్రీకరించి, ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి హాలీవుడ్ చిత్రాల సమర్పకులు ఆండీ కొహెన్ ముందుకు వచ్చారు. శరత్‌మరార్ గారు మా వర్క్ నచ్చి ఈ సినిమాను తెలుగులో సమర్పిస్తున్నారు. సినిమాకు కంటెంట్ ఇంపార్టెంట్. అలాగే సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ కూడా అంతే ఇంపార్టెంట్. మా చిత్రంలో ఈ రెండు ఉంటాయి. టీమ్‌వర్క్ మా సినిమాకు ప్రధాన బలం. ప్రతి అంశం ది బెస్ట్ అన్పించేలా ‘ప్రేమకు రెయిన్‌చెక్’ ఉంటుంది. హాలీవుడ్ మరియు అంతర్జాతీయ భాషలలో రాబోతున్న ‘ప్రేమకురెయిన్ చెక్’. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఇంకో ముఖ్యమైన విషయం. ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా వివిధ భాషలలో నిర్మించాలని హాలీవుడ్ నిర్మాత ఆండీ కోహెన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తెలిపారు. ఆండీ కోహెన్ చిత్ర మరియు టెలివిజన్ ఉత్పత్తిలో పాల్గొన్న యుఎస్ ఆధారిత ఉత్పత్తి మరియు కన్సల్టెన్సీ సంస్థ గ్రేడ్ ఏ ఎంటర్‌టైన్‌మెంట్ అధ్యక్షుడు. ఆయన నేతృత్వంలో, స్టోన్ మీడియా ఫిల్మ్స్ చేతులు కలిపి ప్రపంచవ్యాప్తంగా ‘ప్రేమకు రెయిన్‌చెక్’ ప్రోత్సహించేందుకు ఎంతో ఆసక్తి చూపుతున్నారు. ఆండీ కొహెన్ మాట్లాడుతూ.. ‘ప్రేమకురెయిన్‌చెక్’ యూనివర్సల్ సబ్జెక్ట్. ‘ప్రేమకు రెయిన్‌చెక్’ లేదా ‘రెయిన్‌చెక్ టు లవ్’ గురించి మనకు చాలామంది ఉత్తేజపరిచే విషయం ఏంటి అంటే ఇది ఈ సార్వత్రిక భావనను తీసుకుని పాత్రలను, వినోదభరితమైన ప్లాట్లతో మేము ఏ దేశం లేదా సంస్కృతి నుండి ఉన్నా ఆకట్టుకునే కథాంశం. ఈ కథాంశం భారతదేశంలో ఉన్న ప్రేక్షకులందరికీ పరిమితం కాకుండా, ప్రపంచవ్యాప్తంగా అందజేయాలి అన్నదే మా ఉద్దేశం. చిత్రం తాజాగా మరియు ఆసక్తికరంగా ఉండే మలుపులతో నిండి ఉంటుంది. ప్రతిభావంతులైన నటీనటులు ఈ చిత్రానికి, వారి పాత్రలకి అనుగుణంగా బాగా చేసారు. ఈ చిత్రం ప్రొడక్షన్ విలువలు హాలీవుడ్ చిత్రాలకి ఏమాత్రం తీసిపోదు అన్నారు. అభిలాష్‌వాడ్డ, ప్రియా వడ్లమాని, వౌనికా తవనం, రఘు కారుమంచి, కిరీటి దామరాజు, కల్కీ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: దీపక్ కిరణ్, ఛాయాగ్రహణం: శరత్ గురువుగారి, సమర్పణ: నార్త్ స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్స్, రచన- దర్శకత్వం: ఆకెళ్ళ పేరి శ్రీనివాస్.