గ్లామర్‌కు సై చాందిని చౌదరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బ్రహ్మానందం తనయుడు రాజా గౌతమ్, చాందిని హీరో హీరోయిన్లుగా నిర్వాణ సినిమాస్ సమర్పణలో క్రౌడ్ ఫండెడ్‌గా నిర్మించిన చిత్రం ‘మను’. ఈ చిత్రానికి ఫణీంద్ర నార్‌శెట్టి దర్శకుడు. ఈ చిత్రం ఈనెల 7న విడుదలవుతోంది. ఈ సందర్భంగా హీరోయిన్ చాందిని చౌదరి చెప్పిన విశేషాలు..
మను చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తున్నందుకు ఆనందంగా ఉంది. నా పాత్ర పేరు నీల. నటనకు స్కోప్ ఉన్న పాత్ర ఇది. నిజంగా నా కెరీర్‌లో బెస్ట్ పాత్ర అని చెప్పాలి. ఇంత మంచి అవకాశం ఇచ్చిన దర్శకుడికి థాంక్స్. ఇది మను అనే ఓ వ్యక్తి చుట్టూ తిరిగే కథ. అతని జీవితంలో చాలా షేడ్స్ ఉంటాయి. సస్పెన్స్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులకు కొత్త ఫీల్ కలిగిస్తుంది. ఈ సినిమా నిర్మాణం కోసం దాదాపు రెండేళ్లు టీమ్ అందరం కష్టపడ్డాం. ఇది క్రౌడ్ ఫండింగ్ సినిమా కాబట్టి.. బడ్జెట్ తక్కువ. అందుకే ఉన్నంతలో చాలా జాగ్రత్తగా ప్లాన్ చేశారు దర్శకుడు. ఫేస్‌బుక్‌లో పోస్ట్ ద్వారా కేవలం వారంలో భారీ అవౌంట్ ఇచ్చారు. నిజంగా ఈ రేంజ్‌లో క్రౌడ్ ఫండింగ్ జరిగిన సినిమా ఇదే. తెలుగులో మంచి అవకాశాల కోసం ఎదురుచూస్తున్నా. హీరోయిన్‌గా ఇమేజ్ తెచ్చుకోవడమే నా ఆశ. ఇక గ్లామర్ రోల్స్ అంటారా.. పాత్ర డిమాండ్ బట్టి గ్లామర్‌కు సిద్ధమే. కానీ దానికి లిమిటేషన్స్ ఉంటాయి. టాలీవుడ్‌లో మంచి హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకోవాలని ఉంది అంటూ ముగించారు.