బిజినెస్

సుంకాన్ని తగ్గించలేం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూ ఢిల్లీ, సెప్టెంబర్ 4: చుక్కలనంటుతున్న పెట్రోధరలకు కళ్లెం వేసేందుకు ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించాలనే ప్రతిపాదన ఏదీ లేదని కేంద్ర ప్రభుత్వ వర్గాలు, చమురు కంపెనీలు తెలిపాయి. డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ తగ్గడంతో, పెట్రో ధరలు మండుతున్నాయి. కరెంటు అకౌంట్ లోటు కూడా పెరుగుతోంది. డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ రూ.71.54పైసలకు చేరుకుంది. దీని వల్ల చమురు దిగుమతులపై భారం పడింది. ఢిల్లీలో లీటర్ పెట్రోలు ధర రూ.79.31 పైసలకు, డీజిల్ ధర లీటర్‌కు రూ.71.34 పైసలకు చేరుకుంది. కాగా ఎక్సైజ్ సుంకాలను తగ్గిస్తే బాగుంటుందనే వత్తిడి ఉందని అధికార వర్గాలు తెలిపాయి. మంగళవారం పెట్రోలు లీటర్‌కు 16 పైసలు, డీజిల్ లీటర్‌కు 19 పైసలు చొప్పున పెరిగింది. ఈ ఏడాది ఆగస్టు నెల 15 వ తేదీ తర్వాత చోటు చేసుకున్న అంతర్జాతీయ పరిణామాల ప్రభావం వల్ల చమురు ధరలు భగ్గుమంటున్నాయి. ఆగస్టు 16వ తేదీ తర్వాత పెట్రోలు ధర లీటర్‌కు రూ.2.17 పైసలు, డీజిల్ ధర రూ.2.62 మేర పెరిగింది. కేంద్ర మాజీ మంత్రి పి చిదంబరం మాట్లాడుతూ, పెట్రోధరలపై అదనంగా పన్నుల భారం పడింది. దీని వల్ల రేట్లు పెరుగుతున్నాయన్నారు. పన్నులను తగ్గిస్తే రేట్లు తగ్గుతాయన్నారు. కరెంట్ అకౌంట్ లోటు విస్తృతమవుతోందని, దీని వల్ల ద్రవ్యలోటు జోలికి వెళ్లే పరిస్థితి లేదని ఆర్థిక మంత్రిత్వశాఖ వర్గాలు తెలిపాయి. ఆదాయం కంటే ఖర్చు ఎక్కువుంటే, కరెంట్ అకౌంట్ లోటు పెరుగుతుదన్నారు. తాజా పరిణామాల వల్ల ప్రభుత్వ ప్రాజెక్టులు, స్కీంలపై పెట్టే వ్యయం తగ్గుతుందన్నారు. మూడీ ఇనె్వస్టర్స్ ప్రతినిధి మాట్లాడుతూ, తాజా చమురు ధరలు పెరగడం వల్ల ఆర్థిక రంగంపై వత్తిడి ఉంటుందన్నారు. ప్రస్తుతం కేంద్రం పెట్రోలు లీటర్‌కు రూ. 19.48 పైసల చొప్పున ఎక్సైజ్ సుంకాన్ని, డీజిల్‌పై రూ. 15.33 పైసలు ఎక్సైజ్ సుంకాన్ని వసూలు చేస్తోంది. ముంబాయిలో వ్యాట్ గరిష్ట స్థాయిలో లీటర్ పెట్రోలుపై రూ.39.12 పైసలు ఉండగా, అదే తెలంగాణ రాష్ట్రంలో రూ. 26పైసలను డీజిల్‌పై విధించి వసూలు చేస్తున్నారు.