క్రీడాభూమి

విండీస్ వర్సెస్ టీమిండియా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 4: వెస్టిండీస్‌తో భారత్ ఆడనున్న ఏడువారాల హోం సిరీస్ షెడ్యూల్‌ను బీసీసీఐ, డబ్ల్యుఐసిబిలు ప్రకటించాయి. ప్రస్తుతం ఇంగ్లాండ్ టూర్‌లోవున్న టీమిండియా, సెప్టెంబర్ 15నుంచి ఆసియా కప్‌కు హాజరుకానుంది. సెప్టెంబర్ 28 వరకూ జరిగే ఆసియాకప్‌లో భారత్ సహా బంగ్లాదేశ్, పాకిస్తాన్, శ్రీలంక, ఆఫ్గనిస్తాన్ జట్లు పోటీ పడతాయి. అది పూర్తికాగానే, అక్టోబర్ 4 నుంచి నవంబర్ 11వరకూ భారత్‌లో వెస్టిండీస్ జట్టు పర్యటన మొదలవుతుంది. పర్యటనలో రెండు జట్లూ 2 టెస్ట్‌లు, 5 వనే్డలు, 3 టీ-ట్వెంటీలు ఆడనున్నాయని బీసీసీఐ కార్యదర్శి అమితాబ్ చౌదరి మంగళవారం ఒక ప్రకటనలో వెల్లడించాడు. అక్టోబర్ 4 నుంచి 8 వరకూ రాజ్‌కోట్‌లో తొలి టెస్ట్ జరగుతుంది. అక్టోబర్ 12 నుంచి 16 వరకు రెండో టెస్ట్ హైదరాబాద్‌లో నిర్వహిస్తారు. ఐదు మ్యాచ్‌ల వనే్డ సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్ 21న గౌహతిలో మొదలై.. వరుసగా 24న ఇండోర్‌లో, 27న పుణెలో, 29న ముంబయిలో, నవంబర్ 1న తిరువనంతపురంలో నిర్వహిస్తారు.