అంతర్జాతీయం

ఐక్యతే లక్ష్యంగా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, సెప్టెంబర్ 4: చికాగోలో ఈనెల 7 నుంచి 9 వరకూ మూడు రోజుల పాటు జరిగే ప్రపంచ హిందూ కాంగ్రెస్ సభలు(డబ్ల్యూహెచ్‌సీ)లకు ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి. ప్రపంచ నలుమూలల నుంచి హిందూ సంస్థలకు చెందిన ప్రముఖులు సభలకు విచ్చేయనున్నారు. ఏకంగా 80 దేశాల నుంచి 2,500 ప్రతినిధులు వస్తున్నట్టు నిర్వాహకులు వెల్లడించారు. ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ సభల్లో కీలక ఉపన్యాసం చేస్తారని తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా హిందువులను ఐక్యం చేయాలన్న ఉద్దేశంతో ఏర్పాటవుతున్న సభల్లో పలువురు ప్రముఖులు ప్రసంగించనున్నారు. మాజీ ఐఐటియన్ స్వామి విజ్ఞానంద ఈ మెగామేళకు వ్యూహకర్త. హిందూ సమాజాన్ని ఒక తాటిపైకి తీసుకురావడం, వారికి ప్రయోజనం చేకూర్చే కార్యక్రమాలు చేపట్టాలన్న లక్ష్యంతోనే దీన్ని చేపట్టినట్టు స్వామి ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ వెల్లడించారు. ‘ఇది మత సంబంధమైన సభ కాదు. అలాగే తత్వపరమైందికాదు. ప్రపంచ వ్యాప్తంగా హిందూ సమాజం ఎదుర్కొంటున్న సమస్యలుపై చర్చించడానికి ఉద్దేశించింది’అని ఆయన వివరించారు. ఈ మూడు రోజులు 250 మంది ప్రముఖులు ఉపన్యసిస్తారని ఆయన పేర్కొన్నారు. ఇందులో ఏడు అంశాలపై ప్రధానంగా చర్చిస్తారు. ఆర్థిక, విద్య, మీడియా, సంస్థాపర, రాజకీయ, మహిళ, యువతకు సంబంధించిన అంశాలపై చర్చిస్తారు. విలువలు, సృజనాత్మకత, ఔత్సాహిక పారిశ్రామిక వేత్తల ప్రోత్సాహం వంటి అంశాలపై ప్రముఖులు తన అభిప్రాయాలు వెల్లడిస్తారు. ‘ఒకరి అనుభవాలు ఒకరు పంచుచుకుంటారు. హిందూ సమాజ ఉద్ధరణకు సంబంధించి ఒకరి అభిప్రాయాలు ఒకరు తెలుసుకుంటారు’అని కాంగ్రెస్ కన్నీనర్ అభయా ఆస్థానా స్పష్టం చేశారు. హిందువులు ఎదుర్కొంటున్న సమస్యలు, వాటి పరిష్కారంపై సభల్లో చర్చ జరుగుతుందని ఆయన వెల్లడించారు. ఆస్థానా అమెరికాలో విశ్వహిందూ పరిషత్ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఈ సభలకు ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్‌తోపాటు బౌద్ధుల ఆధ్మాతిక గురువుదలైలామా, పండిట్ రవిశంకర్, అశ్విన్ అధిన్, ఆర్‌ఎస్‌ఎస్ సంయుక్త ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హోసబ్లే,ఎంఐటీ ప్రొఫెసర్ ఎస్‌పీ కొఠారీ, మోహన్‌దాస్ పాయ్, అనుపమ్ ఖేర్, రాజు రెడ్డి, స్వామి పరమాత్మానంద సరస్వతి, చంద్రిక టాండన్, ప్రొఫెసర్ సుభాష్ కక్ ప్రసంగిస్తారు. అలాగే ఆర్థిక అంశాలపై యుఎస్-్భరత్ వ్యూహాత్మక భాగస్వామి ఫోరం అధ్యక్షుడు ముకేష్ అఘి, నీతి ఆయోగ్ మాజీ చీఫ్ అరవింద్ పగారియా, మహీంద్ర గ్రూప్ అధ్యక్షుడు దిలీప్ సుందరం, వాల్‌మార్ట్ నుంచి డేనియల్ బ్రయాంట్, ఫెడరల్ ఎక్స్‌ప్రెస్ నుంచి రాజేష్ సుందరం, ఎమర్సెన్ ఎలక్ట్రిక్ నుంచి ఎడ్ మొనె్సర్ ప్రసంగిస్తారు. ఇంకా అనుపమ్ ఖేర్, వివేక్ అగ్నిహోత్రి, మధూర్ భండార్కర్, అమీష్ త్రిపాఠీ, ఫ్రాంకోయిస్ గుటెయిర్ ప్రసంగిస్తారని ఆస్థానా వెల్లడించారు.