డైలీ సీరియల్

వేదాలలో వైజ్ఞానిక విశేషాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అయితే ఫలానా పెట్టె ఎక్కడ వుంది అని అడిగినప్పుడు అణుఖండాల కొలతలలో దాని స్థానం ఎక్కడ వుందో చెప్పమని మన వుద్దేశ్యం కాదు. అలా కాక ఒక హైడ్రోజను అణువు తీసుకోండి. దాని మధ్యలో ఒక నూట్రాన్ వుంది. దాని చుట్టూ ఒక ఎలక్ట్రాన్ తిరుగుతూ వుంది. సరీగా ఈ సమయంలో ఆ ఎలక్ట్రాన్ ఏ మూల వుంది? అని ప్రశ్నించాం అనుకోండి. అప్పుడు సమాధానం ‘పెట్టె అలమరలో వున్నది’ అన్నంత స్థూలంగా చెప్పలేము. పరిశీలించి చూస్తే ఆ ఎలక్ట్రాన్ తన చిత్తం వచ్చినట్లు చలిస్తుందే తప్ప, ఒక నిశ్చితమైన సమయానికి కట్టుబడి చలించటం లేదని ష్రోడింగర్ సూత్రం ప్రకారం నిరూపణ అవుతోంది. కనుక స్థూలంగా వేసే ప్రశ్నలను సూక్ష్మంగా వేసే ప్రశ్నలను కలగాపులగం చేసుకోరాదు. మనం చేస్తున్నది సూక్ష్మాతిసూక్ష్మ చర్చ అని మరచిపోరాదు.
ప్రపంచం చూసేదా? చూడబడేదా?
ఇంతకూ ‘యూజీన్ వింగర్’ చెప్పినట్లు చేతన యొక్క ముద్ర లేకుండ అణుఖండాల స్వభావాలను నిర్ధారించడం సాధ్యంకాకపోతే, అంటే- చేతనమైన మనస్సుతో సంపర్కం లేని అణుచలనమే లేకపోయినట్లైతే ఇక ప్రపంచంలో కనిపిస్తున్న అణువులు పరిశుద్ధమైన జడ పదార్థాలా? కాదా? అన్న సందేహం తలయెత్తక తప్పదు. అణువులు జడమైతే రుూ ప్రపంచమంతా జడ పదార్థం అవుతుంది. అప్పుడది దృశ్యం అవుతుంది. అనగా చూడబడేది అవుతుంది. అలాకాక అణువులు చైతన్య స్వరూపాలైతే ప్రపంచం అంతా చైతన్య స్వరూపమే అవుతుంది. అప్పుడు ప్రపంచం అంతా చూచేది (ద్రష్ట) అవుతుంది.
మామూలుగా లోకంలో ప్రపంచం దృశ్యమని, మనస్సు ద్రష్ట అని సామాన్యంగా అనుకోవటం ఉంది. అనిశ్చితవాద సిద్ధాంతం వల్లను, యూజీన్ వింగర్ పరిశీలన వల్లను పై చెప్పిన నిశ్చయం తర్కబద్ధమైనది కాదని తేలుతోంది. అందుకనే మైకేల్ టాల్‌బోల్ట్ అనే గొప్ప వైజ్ఞానికుడు ‘‘తత్వశాస్తమ్రు మరియు నూతన భౌతిక శాస్తమ్రు’’ అనే తన అద్భుత గ్రంథంలో యిలా అన్నారు- ‘‘హైసన్‌బర్గ్ యొక్క ఆవిష్కరణ అనంతరం రుూ ప్రపంచం పూర్తిగా దృశ్య ప్రపంచం కావటం ఆగిపోయింది. ఇది ఏక కాలంలో దృశ్యము, ద్రష్ట కూడా అవుతోంది’’ ఇలా అన్నాక ఆ రచయిత ఈ ప్రపంచం యొక్క నూతన స్థితిని వర్ణించేందుకోసం గాను జౄశజీళషఆజ్పళ అనే నూతన పదాన్ని తయారుచేశాడు, అంటే ఆయన ఉద్దేశ్యం ఈ ప్రపంచం దృశ్యము, ద్రష్ట రెండూ అవుతుందని.
అద్వైత వేదాంతంలో అతి క్లిష్టమైన ఒకానొక సిద్ధాంత భాగాన్ని రుూ భౌతిక శాస్త్ర ఆవిష్కరణ సూటిగా పరామర్శిస్తోంది. అద్వైత సిద్ధాంతంలో దృశ్యము, ద్రష్ట, ద్రుక్కు అనే త్రిపుటి ఉన్నది. తత్త్వదృష్టి కలిగినప్పుడు ద్రష్ట, దృశ్యము రుూ రెండూ ద్రుక్కులో ఏకమైపోతాయి. అంటే రుూ మూడిటిని దాటిన స్థితి లభిస్తుంది. ఈ సిద్ధాంతం అర్థం కావటం కొంచెం క్లిష్టమే. మనకు ప్రస్తుతం కావలసింది రుూ త్రిపుటి సిద్ధాంతం మైకేల్ టాల్ బోల్ట్ చెప్పిన ఆనీజెక్టివ్ సిద్ధాంతంలో ఎలా సమన్వయవౌతుందో అన్నంతవరకే.
అంతటా వున్నది చైతన్యమే:
కారణం లేనిదే కార్యం పుట్టదని మనమంతా నమ్ముతున్నాం. ఈ సూత్రం మీదే ఆధారపడి మన భౌతిక శాస్త్రం అంతావృద్ధి పొందింది కూడా. కాని మైక్రోఫిజిక్స్ (అణు భౌతిక శాస్త్రం) పెరిగి పోతున్నకొద్దీ రుూ కార్యకారణ భావం, క్రమక్రమంగా వెనక్కి పోసాగింది. కార్యకారణ భావస్థానంలో గణాంక సంభావ్యత (డఆ్ఘఆజఒఆజష్ఘ ఔ్యఇ్ఘఇజజఆక) కాలూన సాగింది. ఉదాహరణకు ఒక అణుఖండాన్ని మనం తూర్పుగా విసిరామనుకోండి, ఆ అణుఖండము పూర్తిగా తూర్పుకే పోతుందని నమ్మకం లేదు. సగానికి సగం అది పశ్చిమానికి కూడా పోవచ్చు. కార్యకారణ భావసిద్ధాంతాన్ని భంగపరిచే రుూ సత్యాన్ని మహామేధావి ఐన్‌స్టీన్ తన జీవితకాలంలో అంగీకరించలేదు. కాని, తరువాత వచ్చిన అనేక రకాల ప్రయోగాలు నూతన సిద్ధాంతానే్న బలపరిచినాయి. నోబుల్ బహుమతి పొందిన పారిస్ వాసి లూయిస్ దబ్రోలి అనే వైజ్ఞానికుడు అణుఖండాలన్నీ ఘన పదార్థాల నలకలు (ఔ్ఘఆజషళఒ) గానూ, తరంగాలు గానూ కూడా వ్యవహరిస్తాయని నిరూపించాడు. దీనికి ఆయన ఒక క్రొత్త పేరు పెడుతూ అణుఖండాలను జ్ఘీజ్పజషళఒ అన్నాడు. అంటే అవి తరంగాలు, అణువుల నలకలూ కూడా. ఈ సిద్ధాంతం తరువాత వైజ్ఞానికుడు ష్రోడింగర్ పరిశోధనలు చేసి అణు ఖండాల యొక్క ఘన పదార్థ స్వభావానికి - తరంగ స్వభావానికి మధ్య సూత్రాన్ని కూడా కనిపెట్టాడు. దీనికి ఆయనకు నోబుల్ బహుమతి వచ్చింది. తరువాత మాక్స్‌బోన్ అనే మరో వైజ్ఞానికుడు రుూ అణుఖండ తరంగాలు ఔ్యఇ్ఘఇజజఆక తరంగాలు అని నిరూపించాడు. తేలిక భాషలో చెప్పాలంటే ‘అసత్య తరంగాలు’ అన్నమాట. దీనికి కూడా నోబుల్ బహుమతి వచ్చింది. ఈ సిద్ధాంతంపై ఒకప్పుడు రిచర్డ్ ఫిన్‌మన్ అనే నోబుల్ బహుమతి గ్రహీత ఉపన్యాసాలు యిస్తూ ఈ విధంగా వివరించాడు. ‘ఎలక్ట్రానులు ఇనుప గోళీలలాగా పయనించవు. అవి సరళ రేఖేతర మార్గంలో ప్రయాణిస్తాయి. వాటి గమనం చూస్తే అవి సూక్ష్మజీవుల్లాగా వాటి స్వేచ్ఛ ప్రకారంగా చిత్తం వచ్చినట్లు కొంతదూరం ఒక మార్గంలోనూ, కొంతదూరం మరో మార్గంలోనూ, కొంతదూరం తరంగాలుగానూ, మరికొంత దూరం ఘన పదార్థ ఖండాలుగానూ సంచరిస్తూ వుంటాయి.’’
ఇంకావుంది...

‘ఎమెస్కో’ ప్రచురించిన ‘వేదాలలో వైజ్ఞానిక విశేషాలు’ నుంచి స్వీకృతం, పుస్తకం లభించు స్థలం:
ఎమెస్కో బుక్స్ ప్రై.లి. 1-2-7, బానూకాలనీ, గగన్‌మహల్ రోడ్, దోమలగూడ, హైదరాబాద్- 500 029. తెలంగాణ.

ఎమెస్కో బుక్స్ ప్రై.లి. 33-22-2, చంద్రం బిల్డింగ్స్, సి.ఆర్.రోడ్, చుట్టుగుంట, విజయవాడ - 520 004.
ఆం.ప్ర. 0866 - 2436643

కుప్పా వేంకట కృష్ణమూర్తి