ఐడియా

పోషకాలు పుష్కలం.. ఆరోగ్యం పదిలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చాలామందికి క్యాబేజీ అంటే అస్సలు ఇష్టం ఉండదు. దాని వాసనా, రుచీ నచ్చదని చెబుతుంటారు. కానీ ఆకుపచ్చని కూరగాయల జాబితాలో క్యాబేజీని సూపర్ వెజిటబుల్‌గా చెప్పవచ్చు. క్యాబేజీలో మన శరీరానికి ఉపయోగపడే ఎన్నో పోషకాలు ఉంటాయి. దీన్ని విటమిన్లకు నెలవుగా చెప్పవచ్చు. విటమిన్ ఎ, బి1, బి2, బి6, ఇ, సి, కె తదితర విటమిన్లతో పాటు కాల్షియం, ఐరన్, అయోడిన్, పొటాషియం, సల్ఫర్, పాస్ఫరస్, ఫొలేట్ వంటి ఇతర పోషకాలు కూడా క్యాబేజీలో సమృద్ధిగా ఉంటాయి. దానికి తోడు క్యాబేజీని ఎలా వండుకుని తిన్నా పోషకాలు లభిస్తాయి. కానీ దీన్ని ఎలా వండుకుని తినాలా అని ఆలోచిస్తున్నారా? క్యాబేజీని ఇంకో వెజిటబుల్‌తో వండుకుని తిన్నా, పప్పులో వేసి వండినా, పచ్చడిగా చేసుకుని తిన్నా పోషకాలు లభిస్తాయి. క్యాబేజీలో ఉన్న అనేక ఔషధ గుణాల వల్ల మన ఆరోగ్యానికి సంరక్షణ లభిస్తుంది. క్యాబేజీని తరచూ తినడం వల్ల ఎలాంటి అద్భుత లాభాలు కలుగుతాయో చూద్దాం.
* క్యాబేజీలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఫైబర్లు, విటమిన్లు కూడా ఎక్కువగా ఉంటాయి.
* క్యాబేజీని తినడం వల్ల శరీరానికి తక్కువ కేలరీలు లభిస్తాయి. త్వరగా కడుపు నిండిన భావన కలుగుతుంది. అందువల్ల బరువును తగ్గాలనుకునేవారికి ఇది బెస్ట్ ఫుడ్ ఆప్షన్ అని చెప్పవచ్చు. బరువు తగ్గాలనుకునేవారు క్యాబేజీని రోజూ తింటే ఎక్కువ కేలరీలు చేరవు కాబట్టి బరువు త్వరగా తగ్గే అవకాశం ఉంటుంది.
* క్యాబేజీలో ఉండే ఫైబర్ ఎక్కువ సేపు కడుపు నిండిన భావనను కలిగిస్తుంది. అందువల్ల ఆహారం ఎక్కువ తీసుకోకుండా జాగ్రత్త పడవచ్చు.
* క్యాబేజీలో సమృద్ధిగా ఉండే విటమిన్ సి, సల్ఫర్‌లు మన శరీరంలో ఉండే విషపదార్థాలను బయటకు పంపి శరీరాన్ని అంతర్గతంగా శుభ్రం చేస్తాయి.
* క్యాబేజీ శరీరంలోని హార్మోన్ల ఉత్పత్తిని క్రమబద్దీకరిస్తుంది. దీంతో శరీరంలో జీవక్రియలు సరిగ్గా జరుగుతాయి. లివర్, జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది.
* ఊదారంగులో ఉండే క్యాబేజీ రకాన్ని ఆహారంలో తీసుకుంటే మధుమేహాన్ని అదుపు చేయవచ్చు. దీనిలో ఫైటోన్యూట్రియంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవి ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేసేందుకు సహాయం చేస్తాయి. దీనివల్ల బ్లడ్ షుగర్ అదుపులో ఉంటుంది.
* ఊదా, ఆకుపచ్చ రంగులో ఉన్న క్యాబేజీని తినడం వల్ల శరీరానికి సిలికాన్, సల్ఫర్‌లు అందుతాయి. ఇవి మన చర్మాన్ని సంరక్షిస్తాయి. అందువల్ల క్యాబేజీని తింటే చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. చర్మంపై ఉండే మచ్చలు పోతాయి. చర్మం కాంతివంతంగా మారుతుంది.
* క్యాబేజీలో ఉండే విటమిన్ సి, విటమిన్ కె చర్మాన్ని ఫ్రీ ర్యాడికల్ డ్యామేజీ నుంచి రక్షిస్తాయి. కాబట్టి క్యాబేజీని ఎక్కువగా తీసుకుంటే మొటిమలు, గజ్జి వంటి చర్మవ్యాధుల నుంచి కూడా రక్షణ లభిస్తుంది.