మెయిన్ ఫీచర్

ఒత్తిడితో డ్రైవింగ్ వద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రోడ్డుమీదకు వెళ్లిన వ్యక్తి తిరిగి వచ్చేదాకా నమ్మకం లేని పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అప్పటివరకు అందరితో సరదాగా గడిపిన వ్యక్తి రోడ్డుమీదకి వెళ్లిన కొద్ది నిమిషాలలోనే కనిపించని కానరాని లోకాలకు వెళ్లటంతో వారిమీద ఆధారపడిన కుటుంబ సభ్యులంతా రోడ్డున పడే పరిస్థితి. వాళ్ల అంతులేని శోకాన్ని ఆపేవారు ఎవరు? ఇలాంటి సంఘటనలు తమకు ఏ సంబంధంలేకపోయినా ఎదుటివారు చేసే నిర్లక్ష్యపు డ్రైవింగ్‌కు బలయ్యేవారు ఎక్కువవుతున్నారు. ప్రస్తుత పరిస్థితులు ప్రపంచ వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల వల్ల ప్రతిరోజు కొన్ని వేల కుటుంబాలు రోడ్డున పడుతున్న సంఘటనలు కనిపిస్తున్నాయి. రోడ్డు ప్రమాదాలతో పచ్చని కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకుంటున్నాయి. రోడ్డు ప్రమాదాలు జరగడానికి ముఖ్యంగా వ్యక్తుల జీవనశైలిలో మార్పులతోపాటు యాంత్రికమైన జీవనం. ధనార్జనే ధ్యేయంగా టార్గెట్లతో వ్యక్తులు కాలం కంటే వేగంగా ప్రయాణించాలని పరుగులు తీస్తూ అలసి సొలసినిర్లక్ష్యపు డ్రైవింగ్ చేస్తూ ప్రమాదానికి గురైన వారి కుటుంబీకుల జీవితాలు దుర్భరమవుతున్నాయి.
ఎవ్వరూ కూడా రోడ్డు ప్రమాదాలు జరుగుతాయని ఊహించరు, కానీ జరిగేవి జరుగుతూనే వుంటాయి. కాబట్టి సాటి మనిషిగా మానవత్వంతో, సహృదయంతో రోడ్డు ప్రమాదాల్లో గాయపడినవారికి సాయం చేయడంలో మన వంతు సాయాన్ని అందిద్దాం. ఎల్లప్పుడూ ఫోన్‌లో ఎమర్జెన్సీ కాంటాక్ట్ నెంబర్లను ఫీడ్ చేసుకొని ఉంచుకోండి. ఇవి అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగపడతాయి. ప్రమాదంలో వున్నవారికి సాయపడండి. ప్రజల ప్రాణాలు బలిగొండున్న రోడ్డు ప్రమాదాల నివారణ ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలి. జాగ్రత్తగా డ్రైవ్ చేసి మన ప్రాణాలను నిలుపుకుందాం. ఎదుట వచ్చే వారి ప్రాణాలకు హామీనిద్దాం. అత్యవసర సమయాలలో సొంత డ్రైవింగ్‌కు దూరంగా ఉండే ప్రయత్నం చేయాలి.
ఒత్తిడితో డ్రైవింగ్, క్షణాలలో గమ్యాన్ని చేరాలనే మితిమీరిన వేగం వ్యక్తుల ప్రాణాలమీదకు తెస్తున్నాయి. ప్రమాదాల నివారణకు పోలీసులు, ప్రభుత్వాలు ఎన్నో రకాల భద్రతా చర్యలను చేపడుతూ, అమలు చేస్తున్నప్పటికీ, ప్రయోజనం కనిపించడంలేదు. ప్రభుత్వం బాధితులకు నష్టపరిహారం చెల్లించి వారి కుటుంబ సభ్యులను ఆదుకున్నప్పటికీ మరణించిన వారి లోటు పూడ్చలేనిది. ప్రమాదాల్లో మరణిస్తున్న వారిలో ఎక్కువగా 18 నుంచి 35 ఏళ్ల వయసులోపువారే. ప్రభుత్వం ఎన్నిసార్లు కౌనె్సలింగ్ చేసినా, ఎన్ని జరిమానాలు విధించినా యువకుల వేడిరక్తం ముందు అవి ఏమీ పనిచేయడంలేదు. ఇప్పటికైనా యువత అతివేగం అనర్థదాయకం అన్నది తెలుసుకోవాలి. ఇంకా మరెన్నో ప్రాణాలు గాల్లో కలవకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రజల ప్రాణాలు బలిగొంటున్న రోడ్డు ప్రమాదాల నివారణ ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలి. ప్రయాణం చేసే సమయంలో వాహనాలు నడిపేవారు తప్పనిసరిగా రోడ్డు భద్రతా నియమాలను పూర్తి స్థాయిలో పాటించాలి. వేగంకన్నా ప్రాణం ముఖ్యం అని గుర్తించాలి.
కొడుకు కోరిందే తడవుగా అప్పు సప్పు చేసైనా సరే డబ్బులు ఖర్చుపెట్టి మరీ వాహనాన్ని పిల్లవాడి చేతిలో పెడుతున్నారు. కుమారుడికి వాహనం ఎలా నడపాలి అనే మంచి వాక్యాలు చెప్పే సమయం తీరిక తల్లిదండ్రులకు లేదు. కొడుకు అడిగింది తెచ్చి ఇచ్చేస్తే తమ పని అయిపోయిందని భావించే తల్లిదండ్రులు ఇంకొందరు. తల్లిదండ్రులకు గారాబంగా పెంచుకున్న కొడుకుల హఠాన్మరణాలు కోలుకోలేని షాక్‌కు గురిచేస్తున్నాయి. ఎంత సంపాదించి ఏం లాభం, చేతికందివచ్చిన కన్నకొడుకు లేకుంటే? అని భోరున విలపిస్తున్న తల్లిదండ్రుల దుఃఖాన్ని ఆపేదెవరు? కొందరు మద్యం త్రాగి డ్రైవ్ చేసి మరణిస్తే, మరికొందరు మితిమీరిన వేగంతో ప్రాణాలు కోల్పోతున్నారు. డ్రైవింగ్‌లో సెల్‌ఫోన్ మాట్లాడుతూ మరణిస్తున్నవారు ఇంకొందరు తల్లిదండ్రులకు, సన్నిహితులకు, బంధువులకు శోకాన్ని మిగిల్చి వెళుతున్నారు.
అయితే రోడ్డుపై వెళ్ళేవారి నిర్లక్ష్యం కారణంగా కూడా అత్యధిక మరణాలు సంభవిస్తున్నట్లుగా సర్వే రిపోర్టులు తెలుపుతున్నాయి. ఎవరైనా రోడ్డు ప్రమాదంలో గాయపడి రోడ్డుపై పడివుంటే, వారిని తక్షణమే సమీపంలోని ఆస్పత్రిలో చేర్పించాలనిగాని, వారికి సాయం చేయడానికి ప్రక్కనే వెళుతున్న ప్రయాణికులు తమకెందుకులే అనే నిర్లక్ష్యం చూపుతుండడంవలన మరణాల సంఖ్య అధికమవుతోంది. కొందరైతే వీడియోలు తీసి యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేయడం, సాయం చేయండని వాట్సాప్‌లలో మెసేజీలు పంపించేవారు మరికొందరు. అయ్యోపాపం అనేవారే తప్ప వారికి సాయం చేద్దామనుకునేవాళ్లు కరువైపోతున్నారు.. చివరి క్షణాల్లో ఆస్పత్రికి చేరేలోపే ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి.
ఏం చేయాలి?
వ్యక్తిగత వాహనాల సంఖ్య తగ్గించడానికి ప్రధానంగా ఆర్‌టిసిని బలోపేతం చేయాలి. నిర్దిష్ట సమయాలలో మాత్రమే రవాణా వాహనాలను అనుమతించాలి. రోడ్ల సామర్థ్యానికి తగ్గట్టుగా వాహనాలను నడిపేలా చూడాలి. సైవేలపై వేగ నియంత్రణకు గన్‌షూటర్స్‌ను ఏర్పాటుచేయాలి. యూ టర్న్, లింక్ రోడ్లు వద్ద సిగ్నల్ బోర్డులు, ఇండికేటర్లు ఏర్పాటుచేయాలి. డ్రైవర్లకు ఒత్తిడి తగ్గించడానికి నిర్ణీత పనిగంటలు మాత్రమే ఉండాలి. రోజుల తరబడి ప్రయాణం చేసే లారీ డ్రైవర్స్‌కు విశ్రాంతి తీసుకొనే విధంగా అదనపు డ్రైవర్ ఉండేలా చర్యలు తీసుకోవాలి.
పాటించవలసిన నియమాలు
ఒత్తిడితో ఎట్టి పరిస్థితులలో డ్రైవింగ్ చేయకూడదు. మానసిక ప్రశాంతతో డ్రైవింగ్ చేయాలి. డ్రైవింగ్ లైసెన్సు లేకుండా వాహనం నడపరాదు. టూవీలర్స్ విధిగా హెల్మెట్ ధరించాలి. మద్యం సేవించి వాహనాన్ని నడుపరాదు. నో పార్కింగ్ ప్రదేశాలలో పార్కింగ్ చేయరాదు. టూవీలర్స్‌పై ఇద్దరికంటే ఎక్కువ ప్రయాణించకూడదు. ఆటో రిక్షాలలలో ఎక్కువమంది పిల్లలను ఎక్కించి స్కూలుకు పంపరాదు. డ్రైవింగ్ చేసేటప్పుడు సెల్‌ఫోన్ మాట్లాడవద్దు. కార్లు, జీపు వాహన చోదకులు విధిగా సీటు బెల్టు ధరించాలి. రోడ్డుపై వాహనాన్ని ఆపాల్సి వస్తే పార్కింగ్ లైట్లు తప్పనిసరిగా వాడాలి. రోడ్డు భద్రతా నియమాల పట్ల కఠినంగా ఉండాల్సిందే.
ఎవ్వరూ కూడా రోడ్డు ప్రమాదాలు జరుగుతాయని ఊహించరు. కానీ జరిగేవి జరుగుతూనే ఉంటాయి. కాబట్టి సాటి మనిషిగా మానవత్వంతో, సహృదయంతో రోడ్డు ప్రమాదాల్లో గాయపడినవారికి సాయం చేయడంలో మనవంతు సాయాన్ని అందిద్దాం.

- డా. అట్ల శ్రీనివాస్‌రెడ్డి 9703935321