లవర్‌బోయ్ మరో చిత్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యశోజయ క్రియేషన్స్ పతాకంపై సంజీవ్ నాయుడు హీరోగా శీరం జయహరనాథ్ నిర్మించిన చిత్రం ‘లవర్‌బోయ్’ గతంలో విడుదలై మంచి ఆదరణ పొందింది. ఇప్పుడు అదే బ్యానర్‌లో మరో చిత్రానికి శ్రీకారం చుడుతున్నారు. లవర్‌బోయ్‌లో హీరోగా నటించడమేగాక, స్వీయ దర్శకత్వం వహించిన సంజీవ్‌నాయుడు లవర్‌బోయ్‌గా చక్కటి నటనను కనబర్చి విమర్శకుల ప్రశంసలను అందుకున్నారు. దసరా నుండి మరో కొత్త చిత్రాన్ని ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు. సైన్స్‌ఫిక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో కథ సిద్ధమయిందని నిర్మాత శీరం జయహరనాథ్ తెలిపారు. తొలి చిత్రం లవర్‌బోయ్ లభించిన ఆదరణతో మరో చిత్రానికి శ్రీకారం చుట్టినట్లు ఆయన పేర్కొన్నారు. భవిష్యత్తులో మరిన్ని మంచి చిత్రాలు రూపొందించనున్నట్లు చెప్పారు. టాలీవుడ్‌లో ఇప్పుడు వస్తున్న కథలకు భిన్నంగా ఈ చిత్రం కథ సాగుతుందని, సైన్స్ ఫిక్షన్ బ్యాక్‌డ్రాప్ అందర్నీ ఆకట్టుకునే విధంగా ఉంటుందని ఆయన వివరించారు. లవర్‌బోయ్‌గా అన్ని వర్గాల ప్రేక్షకులను తన నటనతో ఆకట్టుకున్న సంజీవ్‌నాయుడు మరోసారి సైన్స్ ఫిక్షన్ కథతో అలరించడం ఖాయం అన్నారు. కథానాయకుడు సంజీవ్‌నాయుడు మాట్లాడుతూ.. ‘సైన్స్ ఫిక్షన్ అంటేనే ప్రేక్షకుల్లో ఎంతో ఉత్కంఠ కలుగుతుంది. అలాంటి ఫిక్షన్‌తో మరోసారి కొత్త చిత్రంతో ప్రేక్షకుల ముందుకొస్తున్నాం. తొలి చిత్రం లవర్‌బోయ్‌కి ప్రేక్షకుల నుంచి వచ్చిన ఆదరణ అంతా ఇంతా కాదు. చిత్రం చూసిన విశే్లషకులు సైతం చక్కటి రేటింగ్‌తో ప్రశంసలను అందజేశారు. ఆ ఉత్సాహంతోనే ముందుకు కదులుతున్నాం. మరోసారి ప్రేక్షకులు ఆదరిస్తారని ఆశిస్తున్నాం. టాలీవుడ్‌లో వెరైటీ కథలతో ప్రేక్షకుల మనసుల్ని గెలుచుకోవాలన్నదే తన లక్ష్యం. ఇక ముందు ముందు సినిమాలతో బిజీ అవుతా’ అన్నారు.