నటుడిగా నిలబెట్టే సూపర్ స్కెచ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సినిమా రంగంలో నటుడిగా నిలబడాలని ట్రై చేసే వాళ్ళు చాలా మందే ఉంటారు... కానీ అవకాశాలు చాలా తక్కువ మందికీ వస్తుంటాయి. అలా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనుకునే వాళ్లలో ఇంద్ర ముందు వరసలో ఉంటాడు. సై సినిమాతో మొదలైన తన సినిమా ప్రస్థానం ఆ తరువాత కురుకురే సినిమాతో హీరోగా మారి పలు చిత్రాల్లో నటిస్తున్నాడు. తాజాగా ఆయన నటిస్తున్న చిత్రం సూపర్ స్కెచ్. నర్సింగ్, ఇంద్ర తదితరులు ముఖ్య పాత్రల్లో రవి చావాలి దర్శకత్వంలో తెరకెక్కిన సూపర్ స్కెచ్ చిత్రం ఈనెల 7న విడుదలవుతున్న సందర్భంగా ఇంద్ర చెప్పిన విశేషాలు.. ఈమధ్య కాస్త గ్యాప్ వచ్చిన మాట నిజమే. ప్రస్తుతం పరిశ్రమలో నిలదొక్కుకోవాలంటే బ్యాక్‌గ్రౌండ్ తప్పనిసరి అయింది. కానీ మనకు అలాంటి అవకాశం లేదు. ఆమధ్య హీరోగా చేసిన సినిమాలు వరుసగా పరాజయం పాలవడంతో అనుకోకుండా గ్యాప్ వచ్చింది. ఆ తరువాత రవి చావాలి దర్శకత్వంలో ఈ సూపర్ స్కెచ్ చేస్తున్నాను. ఇది ఇంటిలిజెంట్ స్క్రీన్‌ప్లేతో తెరకెక్కిన కథ. ఈ సినిమాలో నేను విలన్‌గా నటిస్తున్నాను. ఇంటిలిజెంట్ విలన్ అన్నమాట. ఈమధ్య సినిమాల్లో విలన్‌లు చాలా తెలివిగా ఉంటూ హీరోకి టాగ్‌ఆఫ్ వార్‌గా నిలుస్తున్నారు. అచ్చంగా అదే తరహా. కచ్చితంగా నా కెరీర్‌కు బ్రేక్ ఇచ్చే పాత్ర ఇదని చెప్పాలి. నేను హీరో అవ్వాలని రాలేదు.. కానీ హీరోగా కూడా చేశా. ఇక్కడ నటుడిగా ప్రూవ్ చేసుకోవాలన్న ఆలోచనతో ప్రయత్నాలు చేస్తున్నాను. తప్పకుండ సూపర్ స్కెచ్ ద్వారా ఆ అవకాశం వస్తుందన్న నమ్మకం ఉంది. ఇందులో హీరో పాత్రకు సమానంగా విలన్ పాత్ర ఉంటుంది. ఈమధ్య నేరాలను పసిగట్టడంలో పోలీసులు చాలా అడ్వాన్స్ అయ్యారు.. అయితే వారికి చిక్కకుండా సూపర్ స్కెచ్‌ల ద్వారా విలన్ ఎలా వారిని ముప్పుతిప్పలు పెడతాడు అన్నది ఇందులో చూస్తారు. క్లైమాక్స్ వరకు నా పాత్ర హైలెట్‌గా ఉంటుంది. ఇక ఈ సినిమా తరువాత మెగాస్టార్ సైరా సినిమాలో ఓ కీరోల్ చేస్తున్నాను. నిజంగా ఆ పాత్ర చేయడం అదృష్టం అని చెప్పాలి. ఆ పాత్ర కూడా నాకు చక్కని అవకాశంగా భావిస్తున్నాను. దాంతో పాటు మరో రెండుమూడు అవకాశాలు ఉన్నాయి. ఈ సినిమా విడుదల తరువాత తెలియచేస్తా..