బిజినెస్

పారిశ్రామిక అభివృద్ధిలో టీఎస్‌ఐపాస్ కీలకపాత్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 5: రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి చెందడానకి టిఎస్‌ఐపాస్ కీలకపాత్ర పోషిస్తున్నదని చైర్మన్ గ్యాదరి బాలమల్లు అన్నారు. మెగా పారిశ్రామిక ప్రాజెక్టులతో పాటు కొత్త పారిశ్రామిక ప్రాజెక్టులను త్వరితగతిగా పూర్తి చేయడానికి ప్రభుత్వం ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తోందన్నారు. బషీర్‌బాగ్‌లో రూ.60 లక్షలతో కార్యాలయాన్ని ఆధునీకరించినట్లు ఆయన చెప్పారు. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను టిఎస్‌ఐపాస్ ముందంజలో ఉందన్నారు. కొత్త పరిశ్రమలకు భూముల సేకరణ, రోడ్లు, నీరు, విద్యుత్ ఇతరత్రా వౌలిక సదుపాయాలను టిఎస్‌ఐపాస్ ఏర్పాటు చేస్తోందన్నారు. గత నాలుగేళ్ళలో 7,697 పరిశ్రమలు వచ్చాయని, దీంతో లక్షా 32వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయని అన్నారు. అంతర్జాతీయ కంపెనీలు అమెజాన్, గుగూల్, ఐకియా, ప్లిప్‌కార్డు, ఫేస్‌బుక్ తదితర మల్టీ నేషనల్ కంపెనీలు ప్రాంతీయ కార్యాలయాలను హైదరాబాద్‌లో ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చాయన్నారు. కార్యాక్రమంలో టిఎస్‌ఐపాస్ ఎండీ నర్సింహారెడ్డి, సీఈవో మధుసూధన్, శ్యాంసుందర్, డిప్యూటి కలెక్టర్ శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.