బిజినెస్

వాల్‌మార్ట్ ఫ్లప్‌కార్ట్ ఒప్పందంపై నిరసన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, సెప్టెంబర్ 5: వాల్‌మార్ట్-్ఫ్లప్‌కార్ట్ మధ్య 16 బిలియన్ డాలర్ల ఒప్పందం వల్ల దేశంలో చిన్న వర్తకులపై ప్రతికూల ప్రభావం పడుతుందని, ఈ ఒప్పందానికి నిరసనగా ఈ నెల 15వ తేదీ నుంచి 90రోజుల పాటు ఉద్యమాన్ని చేపడుతామని అఖిల భారత వర్తకుల సమాఖ్య ప్రకటించింది. ఈ నెల 28వ తేదీన భారత్ ట్రేడ్ బంద్ పాటిస్తామని ఆ సంస్థ ప్రకటనలో పేర్కొంది. రిటైల్ రంగంలో ప్రత్యక్ష పెట్టుబడులను అనుమతించడాన్ని నిరసిస్తూ ఉద్యమిస్తామని పేర్కొన్నారు. ఈ నెల 15వ తేదీన ఢిల్లీలో ఆందోళన కార్యక్రమం నిర్వహించనున్నట్లు చెప్పారు. గత నెలలో నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్‌లో పిటిషన్ దాఖలు చేసినట్లు వర్తకుల సమాఖ్య తెలిపింది. ఈ కామర్స్ మార్కెట్ వల్ల వర్తక రంగంలో అవకతవకలు పెరిగాయని ఆ సంస్థ ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ ఖాండేల్‌వాలా చెప్పారు.