బిజినెస్

ఫ్యూచర్ ట్రేడింగ్‌లో పత్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, సెప్టెంబర్ 5: పత్తి కొనుగోళ్లకు సంబంధించి కాటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, ముంబయి స్టాక్ ఎక్స్ఛేంజీ మధ్య బుధవారం అవగాహన ఒప్పందం కుదిరింది. ఫ్యూచర్స్ ట్రేడింగ్ ప్లాట్‌ఫారమ్‌ను ఏర్పాటు చేసి అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో ఈ ఒప్పందం ఖరారు చేశారు. వచ్చే ఐదేళ్లపాటు ఈ ఒప్పందం అమలులో ఉంటుంది. కమోడీటీస్ ట్రేడింగ్ విధానాన్ని ఈ ఏడాది అక్టోబర్ నుంచి ప్రవేశపెడతామని గతంలోనే సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజీ బోర్డ్ ఆఫ్ ఇండియా పేర్కొంది. కాటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు అతుల్ గణత్ర మాట్లాడుతూ పత్తి రైతులకు ఈ కొత్త వేదిక ఉపయుక్తంగా ఉంటుందని, పత్తి బేళ్ల ధరలు తెలుస్తాయని, మార్కెట్‌లో పత్తి విక్రయాలకు మంచి ధర లభిస్తుందన్నారు. దేశవ్యాప్తంగా తమకు 17 ప్రాంతీయ సంఘాలు ఉన్నాయన్నారు. ఫ్యూచర్ ట్రేడింగ్స్‌లో బీఎస్‌ఈ సంపూర్ణ సహకారం అందిస్తామని హామీ ఇచ్చినట్లు చెప్పారు. రూ.1.25 కోట్లతో కాటన్ ఎక్స్ఛేంజీ భవన నిర్మాణాన్ని చేపట్టనున్నట్లు చెప్పారు. మహారాష్ట్ర వ్యవసాయ ధరల కమిషన్ చైర్మన్ పాషాబాయ్ పటేల్ మాట్లాడుతూ రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసేందుకు కొత్త విధానం ఉపయోగపడుతుందన్నారు. రాష్ట్రప్రభుత్వంతో కూడా ఈ విషయాలను చర్చించామన్నారు.