బిజినెస్

పెట్రోల్, డీజిల్ ధరలు యథాతథం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 5: దేశంలో వరుసగా పది రోజుల పాటు పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు బుధవారం యథాతథంగా ఉన్నాయి. చమురు మార్కెటింగ్ సంస్థలు బుధవారం వీటి ధరల్లో ఎలాంటి మార్పు చేయలేదు. మంగళవారం పెంచిన ధరలనే కొనసాగించాయి. అయితే, పెట్రోల్, డీజిల్ ధరలు ఇప్పటికే సరికొత్త రికార్డు గరిష్ఠ స్థాయిలకు చేరుకొని ఉన్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 79.31గా ఉంది. ప్రభుత్వ రంగ చమురు కంపెనీల ధరల పట్టీ ప్రకారం లీటర్ పెట్రోల్ ధర ముంబయిలో రూ. 86.72, చెన్నైలో రూ. 82.41, కోల్‌కతాలో రూ. 82.22గా ఉంది. లీటర్ డీజిల్ ధర ఢిల్లీలో రూ. 71.34, ముంబయిలో రూ. 75.74, చెన్నైలో రూ. 75.39, కోల్‌కతాలో రూ. 74.19గా ఉంది.