బిజినెస్

ప్రత్యామ్నాయ ఇంధనంపై దృష్టి పెట్టాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 5: దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగంతో పాటు ఎథనాల్, మెథనాల్ వంటి ప్రత్యామ్నాయ ఇంధనాలను వినియోగించాల్సిన అవసరం ఎంతయినా ఉందని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. దిగుమతులను తగ్గించి, ఎగుమతులను పెంచడంతో పాటు కాలుష్యాన్ని రూపుమాపాలనేది తమ ప్రభుత్వ విధానమని ఆయన పునరుద్ఘాటించారు. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు భగ్గుమంటున్న నేపథ్యంలో రవాణా మంత్రి చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. బుధవారం ఇక్కడ ఆటోమోటివ్ కాంపోనెంట్ మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఏసీఎంఏ) వార్షిక సదస్సులో మంత్రి మాట్లాడుతూ ప్రత్యామ్నాయ ఇంధనానికి సంబంధించి సూచన చేశారు. ‘మా విధానం చాలా స్పష్టంగా ఉంది. మేము దిగుమతులను తగ్గించాలని, ఎగుమతులను పెంచాలని, కాలుష్యాన్ని రూపుమాపాలని కోరుకుంటున్నాం’ అని ఆయన అన్నారు. ఎలక్ట్రిక్ వాహనాల తయారీకి పూనుకోవడంతో పాటు వాటికే ప్రాధాన్యం ఇవ్వాలని నిరుడు ఆటో ఇండస్ట్రీ (వాహన తయారీ పరిశ్రమ)ని హెచ్చరించిన మంత్రి గడ్కరీ బుధవారం మాత్రం పెట్రోల్, డీజిల్ ఇంధనాలకు తమ ప్రభుత్వం వ్యతిరేకం కాదని పేర్కొన్నారు. భారత్.. కాలుష్యం, ఇంధన దిగుమతుల పెరుగుదల అనే రెండు ప్రధాన సమస్యలను ఎదుర్కొంటోందని గడ్కరీ అన్నారు. ‘దేశంలో ఆటోమొబైల్ రంగం వృద్ధి కారణంగా దిగుమతుల వ్యయం పెరుగుతోంది.
మన ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటున్న అత్యంత పెద్ద సమస్య ఇది. ఈ సమస్యను అధిగమించడానికి మనం ఓ కార్యక్రమంతో ముందుకు రావాలి..’ అని మంత్రి అన్నారు. దిగుమతులకు ప్రత్యామ్నాయంగా ఓ విధానాన్ని రూపొందించాలని ఆయన పేర్కొన్నారు. ‘ప్రత్యామ్నాయ ఇంధనం మనకు తప్పనిసరి’ అని ఆయన స్పష్టం చేశారు.