క్రీడాభూమి

ఆర్సీబీ కోచ్‌గా ఆశిష్ నెహ్రా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు, సెప్టెంబర్ 5: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) వచ్చే సీజన్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఫ్రాంచైజీ కొత్త కోచ్‌గా ఆశిష్ నెహ్రా ఎంపికయ్యాడు. నెహ్రా ప్రస్తుతం ఇదే జట్టుకు బౌలింగ్ కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు.
గ్యారీ కిర్‌స్టన్ కోచింగ్ నాయకత్వంలోని ఆర్సీబీ జట్టుకు నెహ్రా ప్రాతినిధ్యం వహిస్తాడు. గత సీజన్‌లో జట్టులో బౌలింగ్ కోచ్‌గా చేరిన నెహ్రా తనకు జట్టులో మరింత సమర్ధవంతమైన పాత్ర పోషించేందుకు అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపాడు. నెహ్రా భారత్ తరఫున దాదాపు అన్ని ఫార్మాట్లతోపాటు రెండు ప్రపంచ కప్ టోర్నమెంట్లు, మరో రెండు ఆసియా కప్ టోర్నమెంట్లు, మూడు ఐసీసీ చాంపియన్‌షిప్ ట్రోఫీ టోర్నమెంట్లలో ఆడాడు. ఆర్సీబీ బౌలింగ్ కోచ్‌గా ఎంపిక కాకముందు నెహ్రా ఢిల్లీ డేర్‌డెవిల్స్, ముంబయి ఇండియన్స్, పుణే వారియర్స్, చెన్నై సూపర్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ వంటి ఫ్రాంచైజీలకు ప్రాతినిధ్యం వహించాడు. కాగా, ఆర్సీబీ చైర్మన్ సంజీవ్ చౌరివాలా మీడియాతో మాట్లాడుతూ కిర్‌స్టన్, ఆశిష్ నెహ్రా కెప్టెన్ విరాట్ కోహ్లీ నాయకత్వంలోని జట్టును అద్భుత ప్రదర్శనతో ముందుకు తీసుకువెళ్తారని ఆశిస్తున్నట్టు తెలిపాడు.