క్రీడాభూమి

2020 ఒలింపిక్స్‌కు పుష్కలంగా నిధులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: జపాన్‌లోని టోక్యోలో 2020 సంవత్సరంలో నిర్వహించే ఒలింపిక్స్ గేమ్స్‌లో పాల్గొనేందుకు సన్నద్ధమయ్యే అథ్లెట్లకు పుష్కలంగా నిధులు అందజేస్తామని కేంద్ర క్రీడల శాఖ మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ తెలిపాడు. ఇప్పటివరకు ఈ విషయంలో ఎదురవుతున్న ఇబ్బందులు రాకుండా గట్టి చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నాడు. ఇండోనేషియాలో కొద్దిరోజుల కిందట ముగిసిన 18వ ఆసియా క్రీడల్లో పతకాలు సాధించిన వివిధ క్రీడాకారులకు బుధవారం నిర్వహించిన సన్మాన కార్యక్రమం సందర్భంగా ఆయన పీటీఐ ప్రతినిధితో మాట్లాడాడు. రానున్న రోజుల్లో క్రీడారంగంలో భారత్ శక్తిసామర్థ్యాలను ప్రపంచానికి చాటిచెప్పేందుకు అనువైన వాతావరణం కల్పించేందుకు చర్యలు చేపడతామని అన్నాడు. క్రీడల పట్ల అంకితభావం, నిబద్ధత, కష్టపడి పనిచేసే తత్వం ఉన్నవారిని మరింత ప్రోత్సహిస్తామని పేర్కొన్నాడు. క్రీడారంగంలో ప్రభుత్వ అధికారుల అనవసర జోక్యం, ఉదాసీన వైఖరి లేకుండా చూడడం వల్ల పరిణితి కలిగిన అథ్లెట్లను సమాజానికి ఉపయోగపడేలా చూడవచ్చునని అభిప్రాయపడ్డాడు. ఈ విషయంలో ప్రస్తుతం ఉన్న విధానాన్ని సమూలంగా మార్చేందుకు ప్రక్రియను ప్రారంభించామని అన్నాడు. టార్గెట్ ఒలింపిక్ పోడియం స్కీమ్ (టీఓపీఎస్) కింద ముక్కుసూటిగా, పారదర్శకంగా, త్వరితగతిన అథ్లెట్లను ఎంపిక చేయనున్నామని పేర్కొన్నాడు. క్రీడారంగానికి ఎలాంటి నిధుల కొరత లేదని, కొన్ని కార్పొరేట్ సంస్థలు సైతం క్రీడలను మరింత ప్రోత్సహించేందుకు వీలుగా నిధులు సమకూర్చడానికి ముందుకు వస్తున్నాయని అన్నాడు. ఇంతకుముందు క్రీడలకు కేటాయించిన నిధులు వివిధ మార్గాల ద్వారా మళ్లింపు జరగడం వల్ల గందరగోళం నెలకొనేదని, కానీ ఇపుడు అలాంటి పరిస్థితి రాబోదని స్పష్టం చేశాడు. కాగా, ఆసియా గేమ్స్‌లో భారత అథ్లెట్లు 69 (15 గోల్డ్, 24 రజతం, 30 కాంస్యం) పతకాలు సాధించడం ఎంతో ఆనందంగా ఉందని, అంటూ ముఖ్యంగా యువకులు, టీనేజ్ షూటర్లు అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నారని అభినందించాడు. ఇదే ఉత్సాహంతో 2020 టోక్యో ఒలింపిక్స్‌తోపాటు, 2024, 2028 ఒలింపిక్స్ క్రీడల్లో మరిన్ని పతకాలు సాధించగలమనే గట్టి నమ్మకం, విశ్వాసం ఉన్నాయని అన్నాడు.