సంపాదకీయం

బీభత్సానికి ప్రాతిపదిక?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పదకొండేళ్ల క్రితం భాగ్యనగర వాసులు దిగ్భ్రాంతికి గురి అయ్యారు. 2007 ఆగస్టు 25వ తేదీన జంట నగరాలను జంట పేలుళ్లు ప్రకంపితం చేశాయి. ‘కోలుకున్న’ భాగ్యనగర వాసులు గుర్తించిన ఘోర వాస్తవం.. జంట పేలుళ్లకు నలబయి నలుగురు బలైపోవడం, అరవై ఎనిమిది మంది క్షతగాత్రులు కావడం. పదకొండు సంవత్సరాల తరువాత హైదరాబాద్‌లోని ప్రత్యేక న్యాయస్థానం వారు నిందితులలో ఇద్దరిని దోషులుగా నిర్ధారించడం మృతుల కుటుంబాలకు, ‘క్షతగాత్రుల’కు ఊరట కలిగిస్తున్న పరిణామం. ఏడుగురు నిందితులలో ముగ్గురు పరారీలో ఉండడం, మరో ఇద్దరు నిందితులు నిర్దోషులుగా నిగ్గుతేలడం ఆశ్చర్యకరం కాదు. ఎందుకంటె దేశవ్యాప్తంగా దశాబ్దుల తరబడి భయంకర బీభత్సకాండను కొనసాగిస్తున్న పాకిస్తానీ తొత్తులలో అనేక మంది ఇప్పటికీ పట్టుబడలేదు. పట్టుబడిన దుండగులలో బీభత్సకారులలో కొందరు నిర్దోషులుగా నిగ్గుతేలారు, మరికొందరికి వ్యతిరేకంగా న్యాయ విచారణ ప్రక్రియ దశాబ్దుల తరబడి సాగిపోతూనే ఉంది. ఇలా ‘సాగు’తున్న కారణంగానే దోషులకు వ్యతిరేకంగా లభించిన సాక్ష్యాధారాలు సన్నబడి, చచ్చుబడిపోతున్నాయి. అందువల్ల 2007 ఆగస్టు 25న పేలుళ్లు జరిపినట్టు అభియోగగ్రస్తులైన నలుగురిలో ఇద్దరు నిర్దోషులుగా ధ్రువపడడం సహజం. పోలీసులు, ప్రభుత్వ న్యాయవాదులు సాక్ష్యాధారాలను మరచిపోయి ఉంటారు, ఏళ్లు జరిగేసరికి మరపు ముంచుకొని వచ్చింది. అందువల్ల ఆ ‘ఇద్దరి’ నేరాన్ని ప్రభుత్వం వారు న్యాయస్థానంలో ధ్రువపరచలేకపోయారు. కనీసం ఇద్దరు ఘోర జిహాదీ హంతకులకైనా తగిన శిక్ష లభించబోతుండడం ‘గాయాల’కు కొంతైనా ‘చికిత్స’ జరుగుతోందనడానికి నిదర్శనం. ఏడుగురు నిందితులలో ముగ్గురు- రియాజ్ భత్కల్, ఇఖ్‌బల్ భత్కల్, అమీర్ రఝాఖాన్ అనే హంతకులు ఇప్పటికీ పరారీలో ఉండడానికి ప్రధాన కారణం మన పొరుగుదేశాల ప్రభుత్వాల అమిత్ర వైఖరి. వీరు ఇలాంటివారు మారుపేర్లతో ‘ప్రయాణ అనుమతి పత్రాల’- పాస్‌పోర్ట్‌లు-ను ఏర్పాటు చేసుకోగలగడం మన భద్రతా కుడ్యాలలో ఏర్పడిన ఛిద్రాలకు వికృత నిదర్శనం. ఈ కన్నాలను పూడ్చలేకపోవడం దశాబ్దులుగా పాకిస్తానీ జిహాదీలు, పాకిస్తాన్ బీభత్స రాజ్యాంగ వ్యవస్థ ప్రేరిత హంతకులు మన దేశంలోకి- మన దేశం నుండి- నిర్భయంగా, యథేచ్ఛగా రాకపోకలు సాగించడానికి కారణం! నకిలీ గుర్తింపు పత్రాలను, నకిలీ ప్రయాణ అనుమతి పత్రాలను, నకిలీ ‘ప్రవేశ అనుమతి పత్రాల’- వీసాల-ను సృష్టించడం పాకిస్తాన్ ప్రభుత్వ బీభత్స ప్రక్రియలో భాగం. భాగ్యనగరంలో 2007లో జంట పేలుళ్లను జరిపిన హంతకుల ‘ఘటన’లకు పూర్వం, ‘ఘటన’ల అనంతరం ఇలా రాకపోకలు సాగించగలిగారు. 2007 ఆగస్టు 25వ తేదీనాటి ‘ఘటన’లు సూచికలు మాత్రమే. అప్పటికీ ఇప్పటికీ మన అంతర్గత భద్రత ఏమంత మెరుగుపడలేదు. సరిహద్దుల గోడలలోని కన్నాల గుండా, భద్రతా కుడ్య ఛిద్రాల గుండా బీభత్సకారులు చొరబడుతూనే ఉన్నారు. దేశంలో ప్రధానంగా జమ్మూ కశ్మీర్‌లోను, ఈశాన్య ప్రాంతంలోను పాకిస్తాన్ బీభత్సం, చైనా ప్రేరిత బీభత్సం ఆగకపోవడానికి కారణం ఈ ‘కన్నాలు..’
కొందరు బీభత్సకారులు పట్టుబడడం, ఇంకెందరో హంతకులు తప్పించుకొని దేశమంతటా విశృంఖల విహారం చేస్తూండడం ప్రచారవౌతున్న సమాచారం. ఇందుకు ప్రధాన కారణం ‘జిహాద్’ను సమర్ధిస్తున్న ఇస్లాం మత రాజ్య వ్యవస్థలున్న దేశాలన్నది ప్రచారం కాని వ్యవహారం. పాకిస్తాన్ ప్రభుత్వం మాత్రమే ప్రచారవౌతోంది. పాకిస్తాన్ మనకు ప్రత్యక్ష శత్రువు. కానీ మన పశ్చిమ సముద్రానికి పశ్చిమాన నెలకొని ఉన్న ‘ఇస్లాం మత రాజ్యాంగ’ దేశాలు ప్రచారం కావడం లేదు. ఈ దేశాలలో అత్యధికం మనకు పరోక్ష శత్రువులు. పాకిస్తాన్ మాత్రమే పేరుపెట్టి విమర్శించగలుగుతున్న మన ప్రభుత్వం ఈ పరోక్ష శత్రువులను పేరుపెట్టి విమర్శించలేకపోతోంది. ఇందుకు కారణం దశాబ్దుల తరబడి ఈ దేశాలు మన దేశం పట్ల మైత్రిని అభినయిస్తున్నాయి. ఈ ఇస్లామీ దేశాల వారు పాకిస్తాన్ దుశ్చర్యలను, బీభత్సకాండను బాహాటంగా నిరసిస్తాయి.. కానీ మన దేశ ప్రజలను హత్యచేసి, తమ దేశాలకు చేరుతున్న బీభత్సకారులను పట్టి మన ప్రభుత్వానికి అప్పగించడం లేదు, పసికట్టి పట్టుకొనడానికి సహకరించడం లేదు. 2007 ఆగస్టు 25న హైదరాబాదు ‘లుంబినీ వనం’లోను, కోఠి ప్రాంతంలోని ‘గోకుల్‌‘ ఆహారశాల- చాట్-లో పేలుళ్లు జరిపిన రఝా అమీర్‌ఖాన్ ‘దుబాయి’లో స్వేచ్ఛగా జీవిస్తుండడానికి ఇదీ కారణం. ‘లష్కర్ ఏ తయ్యబా’ ముఠాకు చెందిన ఈ ముష్కరుడు పశ్చిమ బెంగాల్ నివాసిగా పేరుమోశాడు. బంగ్లాదేశ్ నుంచి చొరబడి పశ్చిమ బెంగాల్‌లో స్థిరపడి, బీభత్స కలాపాలు నిర్వహించిన వందల ‘ఐఎస్‌ఐ’ హంతకులలో వీడు ఒకడు కావచ్చు..
భాగ్యనగరంలోని ‘గోకుల్ చాట్’లోను, లుంబినీపార్క్ ప్రాంతంలోను జరిగిన పేలుళ్లకు అనేక నెలలపాటు కుట్ర జరిపినవాడు రఝా అమీర్‌ఖాన్.. వీడు ఇంతవరకూ దొరకలేదు! అమీర్ రఝాఖాన్ ‘ఆదేశాల’ననుసరించి రియాజ్ భత్కల్, ఇఖ్‌బల్ భత్కల్ పేలుళ్ల కుట్రను, వ్యూహాన్ని రచించి అమలు జరిపారు. ఈ ముగ్గురూ ‘పరారీ’లో ఉండగలగడం మన పొరుగు దేశాల ‘అప్రత్యక్ష అమైత్రి’కి ఒక నిదర్శనం. ఈ ముగ్గురు పిశాచాలు వౌలిక నేరస్థులు, వారు దొరకలేదు. దొరికిన వారిలో ఫారూక్ షర్ఫుద్దీన్ తర్‌కాష్, మొహమ్మద్ సాదిక్ ఇస్రార్ అహ్మద్ అనేవారు దోషులని ధ్రువపడలేదు. అనీఖ్ షఫీఖ్ నరుూద్ అనే వాడు, మహమ్మద్ అక్బర్ ఇస్మాయిల్ చౌదురి అనేవాడు మాత్రం దోషులుగా ధ్రువపడినారు. ఈ ‘్భత్కల్’ ముష్కరులు ఆ తరువాత హైదరాబాద్ దిల్‌సుఖ్‌నగర్ సాయిబాబా మందిరం సమీపంలో జరిగిన పేలుళ్లకు కూడ సూత్రధారులు. కర్నాటకలోని అటవీ సీమలలో బీభత్సపు ‘బట్టీలు’ నెలకొని ఉండినట్టు 2007వ సంవత్సరానికి పూర్వమే విస్తృతంగా ప్రచారమైంది. దేశవ్యాప్తంగా ‘నిఘా’ నిద్దురపోయిన కారణంగా భత్కల్ ముష్కరులు ఆ బీభత్సపు బట్టీల నుంచి బయటికి వచ్చి కర్నాటక నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు వ్యాపించారు. విదేశాలకు పారిపోయారు. ఫర్షియా సింధుశాఖ దేశాలతోను తూర్పున ఉన్న మలేసియాతోను మనకు గొప్ప ‘మైత్రి’ నెలకొని ఉంది. కానీ ఈ దేశాల ప్రభుత్వాలు మాత్రం ‘టెర్రరిస్టుల’ను ఏరివేయడంలో మనకు సహకరించవు. అందువల్లనే ‘అమీర్ రఝాఖాన్’ దుబాయిలో ఉండగలుగుతున్నాడు. జాకీర్ నాయిక్ అనే ముంబయి నివాసి బీభత్స కలాపాలను ఏళ్లతరబడి సాగించి సౌదీ అరేబియాకు పారిపోయాడు. మిత్ర దేశమైన సౌదీ అరేబియా ప్రభుత్వం వారు అతగాడిని అరెస్టు చేసి మనకు అప్పగించలేదు. ఈ జాకీర్ నాయిక్ తరువాత మలేసియాకు విమానమెక్కి వెళ్లాడు. ‘జాకీర్ నాయిక్‌ను మీ దేశానికి అప్పగించబోము..’-అని మలేసియా ప్రభుత్వం నిర్లజ్జగా మన ప్రభుత్వానికి స్పష్టం చేసిందట! ఇదీ సౌదీ అరేబియా, మలేసియా వంటి దేశాలతో మన మైత్రికి గీటురాయి.. ఇరుగుపొరుగు దేశాలు ఇవి!
ముంబయిలో 2008 నవంబర్‌లో భయంకరమైన పేలుళ్లు జరిగిన తరువాత సౌదీ అరేబియా ప్రభుత్వ ప్రతినిధులు మన దేశానికి వచ్చారు. వారు పాకిస్తాన్ బీభత్స విధానాలను తప్పుపట్టలేదు. భారత్-పాకిస్తాన్‌లు చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని సలహా ఇచ్చారు. ఇదే సమయంలో ప్రముఖ అరబ్ దేశాలలో పాశ్చాత్య ప్రచార మాధ్యమాల వారు ‘సర్వే’ నిర్వహించారు. ముంబయిలో పాకిస్తాన్ జరిపిన బీభత్సకాండను అధికాధిక అరబ్ ప్రజలు ఆమోదించారన్నది సర్వేలో తేలిన నిగ్గు. ఈ బీభత్సం ‘పవిత్రమైన’ జిహాద్‌లో భాగమని వారు భావించారట, హర్షించారట! ప్రపంచంలోని ఇతర మతాలను నిర్మూలించి ఇస్లాంను ఏకైక మతంగా ప్రతిష్ఠించం ‘జిహాద్’ లక్ష్యం. ఇందుకు మాధ్యమం బీభత్సకాండ. లుంబినీ, ‘గోకుల్’ పేలుళ్లు ఈ బీభత్సంలో భాగం!