సబ్ ఫీచర్

మనో నిగ్రహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జీవులన్నింటికి పుట్టుకతో శరీర అవసరాలు జీవించడానికి ఆకలి, దప్పికలే ముఖ్యమైనవి కూడా. ఈ ఆకలి, దప్పికలే మనిషి ఆహార, పానీయ అలవాట్లుగా మార్పు చెందాయి. జీవించడానికి తినడం ఒక విషయమైతే తినడానికే జీవించడమన్నంతగా ఆకలి, దప్పిక మార్పు చెందాయి. వయసును బట్టి, శరీర అనారోగ్యాలను బట్టి ఆహారం తీసుకునే విధానాలు వేర్వేరు ఉంటూంటాయి.
ఆహారంలో మనిషి కోరికల ప్రకారం, రకరకాల రుచులు వంటలు తయారీ, అందరికి అన్నీ పడకపోవవచ్చు కాని నాలుకచే ‘మనసు’ అందరినీ జిహ్వచాపల్యం అంటూ అల్లల్లాడిస్తూంటుంది. అలాగే మంచినీరుతో తీరే దప్పిక కూడా అనేకానేక పానీయాల అలవాటుగా మారిపోతుంది. కాఫీ, టీ, చల్లటి పానీయాలు, ఇవి కాక రకరకాలతో త్రాగడానికి మనుషులు అలవాటుపడ్డారు. ఆ పానీయం త్రాగకపోతే ఉండలేం అన్నది పూర్తిగా మానసిక బలహీనతే! మనసుపడే రకరకాల కోరికలను అన్ని శరీరానికి ఆపాదించడం మనిషి చేసే పని! మనిషి శరీమే తాననుకోవడం వలన అలా అనుకోవడం జరుగుతుంది. తిండి, దప్పికలోనే కాకుండా ఇతర విషయాల్లో దృశ్య వీక్షణం, శ్రవణం, స్పర్శ, వాసన ఇవన్నీ కూడా మనసు పడే కోరికల విన్యాసాలే దృష్టి విషయానికైతే నాలుకనుమించి వీక్షణ చాపల్యాలు దృష్టిపడిన ప్రతిదీ పదే పదే చూడాలనుకోవడం చూసి ఊరుకోక స్వంతం చేసుకోవాలనుకోవడం- ఇలా అనేక పోకడలు, ప్రయత్నాలు మనిషి దృష్టిపడని చోటుండదేమో! రవి కాంచని చోటు కవి కాంచడు అనేకంటే మనిషి కాంచని చోటనుకుంటే బాగుంటుంది. కవి అనుకోవడమెందుకు? కవి కూడా మనిషేగా! ఒకటే తేడా, కవి తన కవనంతో తెలియజేస్తే మనిషి తన ఆలోచనల్లో తేలుతూ మాటల్లో చేతల్లో తెలియజేస్తాడు.
ఎంతసేపు మనిషికి తన విషయాలకంటే ఇతర విషయాలమీద ఆసక్తి, ఆరాలు, ఆ పంరగా విషయ సేకరణలుంటాయి. మనిషి తనశరీరానికి ముందునుండే ఎటువంటి సదుపాయం అలవాటు చేస్తే ఆ విధంగా అలవాటుపడటం జరుగుతుంది. కానీ శరీరం ఆయా సదుపాయాలు తెలియకుంటే తన మాట వినదనే భావనతో చాలామంది మాట్లాడుతుండడం చెప్తూండటం జరుగుతుంది కాని కేవలం అవి అపోహలు మాత్రమే!
తన స్థితిగతులను బట్టి మనిషి చేసుకునే రోజురీ అలవాట్లు మాత్రమే అంతే! అందుకే ఈ కారణంగా లోకోభిన్నరుచి అనే నానుండి వచ్చింది.
‘ఇంద్రియాణి పరాణ్యాహుః’ అనే శ్లోకం భగవద్గీతలో 3వ అధ్యాయం 42వ శ్లోకం శ్రీకృష్ణ్భగవానులు చెప్పారు.
మనసు, బుద్ధి, ఇంద్రియాల గూర్చి స్థూల శరీరం కంటే, ఇంద్రియాలు బలీయం, ఇంద్రియాలకంటే ‘మనసు’ బలీయం, మనసుకంటే బుద్ధి శ్రేష్ఠమైనది. వీటన్నిటికంటే సూక్ష్మమైనది, గుర్తించలేనిది ఆత్మ! బుద్ధి మాట మనసు విననినాడు మనిషి అనేకానేక పాట్లు పడవలసి ఉంటుంది. కామ, క్రోధం, లోభం వీటన్నిటికీ మనిషి లోబడటం జరుగుతుంది. బుద్ధితోనే మనసుకు నిగ్రహం అనేది జరుగుతుంది.
మనిషి అనుకుంటే నిగ్రహం, సాధన పొందగలడు. ఆ అనుకోవడమే జరగాలి. నేనెందుకు ఏ అలవాటైనా మానుకోవాలి, ఈ కొత్త అలవాటు చేసుకుంటే ఏమవుతుంది. నాకేదో దీనివలవన సంతోషం కలుగుతుంది కదా అని తాత్కాలికానందం పడితే రాబోయే కాలంలో తానే బాధపడాలనేది సత్యం.
మంచి అలవాటు మనోనిగ్రహంతోనే సాధ్యం. చెడు అలవాట్లు, ఇంద్రియాలతో చేసే చెడ్డ పనులనేవి విడిచిపెట్టగలగడమే నిగ్రహానికి నిదర్శనాలు.
ఒకసారి మహానుభావుడు రామకృష్ణ పరమహంసగారి వద్దకు ఒక స్ర్తి తన కుమారుని తీసుకుని వచ్చి బెల్లం తినడమనే దురలాటు గూర్చి, దానివలన కలిగే అనారోగ్యం గూర్చి దాన్ని మాన్పించలేకపోతున్నానని చెప్పడం జరిగింది. ఆమెను వారం తర్వాత రమ్మనమని ఓసారి చెప్పి, ఆమె వారం తర్వాత రాగా, మరలా మరోవారం తర్వాత రమ్మని చెప్పారు. ఇలా రెండుసార్లు జరుగ్గా, మూడోసారి వచ్చినపుడు పరమహంస పిల్లవాని తలపై చేయివేసి బాబూ బెల్లం తినకు, మంచిదికాదు, అనారోగ్యం చేసింది కదా అన్నారట.
పిల్లవాడు అలానే స్వామి అని వెళ్లిపోయాడు. ఆ విధంగా అలవాటును మానాడాట ఆ పిల్లవాడు.
ఈ విషయం గూర్చి శిష్యులు అడగ్గా, తాను బెల్లం తినడం మాని పిల్లవానికి మానమని చెప్పాలని చెప్పారుట.
అలాగ మనమేదైనా మంచి అలవాట్లలో వుంటే ఏ పనైనా చేయగలము. ఏ మాట చెప్పినా ఎవరైనా ఆమోదించగలరు. అందుకని మంచి చెడుల గూర్చి మనోనిగ్రహం మనుష్యులందరికి ఆవశ్యకం.

-గంటి కృష్ణకుమారి