మెయిన్ ఫీచర్

పంచభూతాత్మకములు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాత్విక గుణ ప్రధానమైన మనిషియందు, అహింస, అస్తేయం, అసత్యమాడకుండుట, వ్యభిచరించకుండుట, కోపం లేకపోవడం, గురుసేవ, శారీరక మానసిక శౌచం సంతోషం ఋజువర్తనం, తననుతాను కీర్తించుకోకుండుట, వేద శాస్త్రాలపై విశ్వాసం కలిగి వుండటం వంటి మంచి లక్షణాలుంటాయి. ఇక రాజసవృత్తి గల వ్యక్తి అన్నిటికి తానే కర్త భోక్త. తనవల్లనే అంతా జరుగుతోందని, వాచాలత్వం, దురభిమానం కలిగి వుంటాడు. తాపస ప్రవృత్తి గల వ్యక్తి అతి నిద్ర, మోహం, అత్యాశ, మైథునచింత, సోమరితనం, దొంగతనం వంటి దుర్గుణములు కలిగినవాడని బ్రహ్మవేత్తలు చెబుతారు. పై ముగ్గురిలో సత్వగుణ ప్రధానుడైన వ్యక్తి స్వర్గాది లోకాలను పొందుతాడని, రాజస గుణం కలిగినవాడు మర్త్య లోకంలోను, తామస గుణంతో వర్తించే వ్యక్తి నరక లోకాన్ని పొందుతాడని చెప్పారు. బ్రహ్మజ్ఞానం సాత్వికమైనదిగాను, ధర్మజ్ఞానాన్ని రాజసికంగాను, అజ్ఞానాన్ని తామసికమైనదిగాను చెప్పింది ఉపనిషత్. మనిషికి నాలుగు అవస్థలుంటాయి. అవి జాగృత్, స్వప్న, సుషుప్తి, తురీయావస్థలు. ఇందులో జాగ్రదవస్థ- పంచ జ్ఞానేంద్రియ, పంచ కర్మేంద్రియ, నాలుగు అంతఃకరణలు (5+5+4) కలిసి 14 యింద్రియాలతో కూడుకుని వుంటుంది. స్వప్నావస్థ కేవలం నాలుగు అంతఃకరణలతో వుంటూంది. కేవలం చిత్తంతో మాత్రమే వుండేది సుషుప్తావస్థ. జీవుడితో మాత్రమే కలిసి వుండి మిగతా అంతఃకరణలు లేకుండా వుండేది తురీయావస్థ. జీవాత్మయే క్షేత్రజ్ఞుడనబడుచున్నాడు. పంచజ్ఞానేంద్రియ, పంచకర్మేంద్రియ, పంచప్రాణములు, మనసు, బుద్ధి అనే పదిహేడింటితో కూడుకున్నదే సూక్ష్మశరీరము, లేక లింగ శరీరము. మనసు, బుద్ధి, అహంకారము, ఆకాశము, వాయువు, అగ్ని, జలం, భూమి అనే ఎనిమిది ప్రవృత్తులు. చర్మం, కన్ను, నాలుక, ముక్కు, గుదం, ఉపస్థ, చేతులు, కాళ్ళు, వాక్కు, శబ్ద, స్పర్శ, రూప, రసగంథము లనే పదిహేను తత్వాలు, పైన చెప్పిన ఎనిమిది చేరి మొత్తం 23 తత్త్వాలుగా వున్నాయి. వీటికి ప్రధానమైన ‘‘అవ్యక్తమనే తత్త్వం కలువగా మొత్తం చతుర్వింశతి (24) తత్త్వాలయ్యాయి. వీటన్నిటిలోకి ప్రధాన తత్వం ‘‘అవ్యక్తం’’ కాగా తద్భిన్నమైనవాడు పురుషుడు, వాడే పరమాత్మ. ఈ ప్రాణిశక్తినే ఆధునిక భాషలో ‘‘బయోప్లాస్మా’’ అంటారు. ఇది భౌతిక శాస్త్రంలోని శక్తి సిద్ధాంతంకన్నా కొంత భిన్నంగా ఉంటుంది. ఆధునిక పరిశోధనలు మరియు యోగశాస్త్ర గ్రంథాల సహాయముతో, అద్భుతమైన పరస్పరానుబంధ సిద్ధాంతమును గురించి కొన్ని పరిశోధనలు జరిగాయి. వీటిలో ముఖ్యమైనది, ‘‘కిర్లియన్’’ అనే రష్యన్ శాస్తవ్రేత్త, మన కంటికి కనబడని, అగోచరమైన రుూ ప్రాణశక్తి సీమలను ఫొటో తీసే విధానమును కనిపెట్టాడు. ఇతని ప్రయోగము వలన, స్థావర జంగమములనబడే చరాచర జీవులన్నింటిలోను ప్రాణశక్తి (ఆరా) వున్నదని అది అణువుల స్థూల కదలికల కన్నా సున్నితంగా ఉంటుందని తెలిసింది. మన శరీరమందలి కూర్మవాయువు, శరీరానికి కాంతి (ఆరా)నిస్తుందని చెప్పబడింది. మామూలుగా మనం మహాత్ముల ఫొటోలు చూసినపుడు వారి తల చుట్టూరా ఒక దివ్య కాంతివలయం కనబడుతుంది. (చిత్రీకరించబడి ఉంటుంది). కిర్లియన్ ప్రయోగంలో ప్రతి జీవి (జీవ పదార్థం) చుట్టూ ఇటువంటి కాంతి వలయముంటుందని తేలింది. అయితే అనారోగ్యంగా ఉన్నపుడు రుూ కాంతి వలయం (ఆరా) బలహీనముగాను కాంతి తక్కువగాను, ఆరోగ్యము పొందిన పిదప, తిరిగి కాంతివంతముగాను ఉన్నట్లు తెలియవచ్చింది. అంతేగాక ఒక వ్యక్తి ప్రాణశక్తి అతని మానసిక స్థితిని కూడా తెలియచేస్తుందని తెలిసింది. మరియు ఉదయం లేవగానే మన ‘ఆరా’ ప్రకాశవంతముగాను విస్తారముగాను ఉంటుంది. రోజంతా కష్టపడి అలసిపోయిన తరువాత ‘ఆరా’ బలహీనముగా కుంచించుకుపోయి వుంటుంది. కాని 15-20 నిముషముల యోగాభ్యాసము లేక ధ్యానము చేసిన తరువాత కాంతి వలయము (ఆరా) పునరుద్ధరింపబడి తిరిగి ప్రకాశవంతమవుతోందని తేలింది. దీనివలన శక్తియొక్క అద్భుత ప్రవర్తన వ్యక్తమవుతోంది. నశించిన పదార్థములుగా చెప్పబడే వాటిలో కూడా ప్రాణశక్తి ఉందని, శక్తిసీమలను పరిశోధించిన శాస్తజ్ఞ్రులు తేల్చి చెప్పారు. కాబట్టి ప్రాణం అంటే కేవలం ‘జీవం’ అని మాత్రమే కాక, ‘‘జీవం యొక్క ఉనికి’’అని కూడ అర్థమవుతోంది. ఎక్కడైతే చలనము మరియు స్థిరత్వము కలసి వుంటాయో అక్కడ ప్రాణశక్తి ఉంటుంది. మన శరీరంలో ‘‘రసం (సిరమ్) రక్తము, మాంసము, అస్థి, మజ్జ, మేధస్సు, శుక్రము, అని ఏడు ధాతువులు కలవు. ఇవి భౌతికమైనవి కనుక, కళ్ళతో చూడగలము, వీటిలో అన్నిటికంటే సూక్ష్మమైనది, విలువైనది, శుక్రము. దీనికంటే, మిక్కిలి సూక్ష్మమైనవి, సూక్ష్మదర్శినితో కూడ చూడలేనివి ఉన్నాయి. వాటి పేర్లు, ‘‘ఓజోసి, సహాసి, బలమసి, భ్రాజోసి, దేవానాం ధామనామాసి, విశ్వమసి, విశ్వాయుః సర్వమసి, సర్వాయుః అభిభూః ఓం’’ ఈ నామములు సంధ్యావందనములో పేర్కొనబడ్డాయి. తెలివిని, బలాన్ని ఎలా అయితే కళ్ళతో చూడలేమో అలాగే, ఓజస్సు, భ్రాజస్సు మొదలైన వాటిని కూడా చూడలేము. పాంచభౌతికమగు మానవ శరీరమును విశ్వాత్మకుడగు విరాట్ పురుషునితో పోల్చి చూసినపుడు రెండు ఉపాధులును పంచభూతాత్మకములే. బేధమల్లా విరాట్ పురుష రూపుడు విశ్వాత్మకుడు, మాయాతీతుడు, గుణాతీతుడుగాను, వ్యష్టి శరీరము, మాయకు లోబడి మాయాశక్తివల్ల కలిగిన రజోగుణ ప్రధానమగు ప్రాణశక్తియుతమై యున్నది.

డా॥ గుడిపాటి వి.ఆర్.ఆర్.ప్రసాద్ 9490947590