డైలీ సీరియల్

పచ్చబొట్టు-40

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రెండు గంటల శ్రమ తర్వాత పండంటి పాపాయిని ప్రసవించిందామె.
తేలికగా ఊపిరి పీల్చుకుంది విద్య.
పేషెంట్ టెన్షన్ పడుతుంటే తమకు టెన్షన్ ఉండదు కానీ వాళ్ళ అవస్థకు జాలివేస్తుంది. బిడ్డ పుట్టిన ఆనందంలో వాళ్ళ కళ్ళల్లోకి వెలుగువస్తే తమ కళ్ళలోకి రిలీఫ్ వస్తుంది.
బయటకు వచ్చిన విద్య చేతిలో స్వీట్ బాక్స్ ఉంచాడు అమ్మాయి భర్త.
‘‘మీరే అందరికీ పంచెయ్యండి’’ అని తను ఒక స్వీట్ తీసుకుంది విద్య.
నవ్వుతూ తన రూమ్‌వైపు నడిచింది విద్య. రోగుల మధ్య ఉన్నపుడు చిరునవ్వు సడలనివ్వదు. తన చిరునవ్వే వారికి మొదటి మందు అనుకుంటుంది.
‘‘ఈ అమ్మ చదువు ముగించుకొని వచ్చి ఒక సంవత్సరమే అయిందట. కానీ హస్తవాసి మంచిదని, ఎంత కష్టమయినా కాన్పు అయినా సునాయాసంగా చేసెయ్యగలదని మంచి పేరు తెచ్చుకొంది. అందుకే ప్రభుత్వ హాస్పిటల్ అని చిన్నచూపు చూడకుండా ఇక్కడకు రావటం’’
బయట కూర్చున్న రోగులు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నారు.
‘‘అవును. ప్రతి పేషెంట్‌ను సొంతవాళ్ళలా పలకరిస్తుంది. వాళ్ళ ఊర్లూ, పేర్లు కూడా గుర్తుపెట్టుకుంటుంది. ఆయమ్మ మాట్లాడితేనే సగం రోగం తగ్గిపోతది’’.
‘‘డాక్టర్ అంటే ఇలాగ ఉండాలి’’
‘‘ఆ యమ్మ ఇలా కలకాలం చల్లంగా ఉండి మనల్ని కాపాడాలి’’.
నర్సు నవనీతం వారి మాటలకి నవ్వుకుంది.
ఇలా విద్య గురించి రోజుకు వందమందయినా మాట్లాడుకుంటూనే ఉంటారు.
విద్య ఒక్క పేషెంట్లనే కాదు ప్రతివారినీ గౌరవిస్తుంది. నర్సులను సొంత చెల్లెళ్లలా చూసుకుంటుంది. వారికే కష్టం వచ్చినా తానున్నానని గుర్తుచేస్తూ అడగకుండానే ఆదుకుంటుంది.
అందుకే ఆమె అంటే హాస్పిటల్‌లో అందరికీ ప్రత్యేక అభిమానం.
చెరగని చిరునవ్వు ఆమె ఆభరణం.
డాక్టర్ విద్య ఆ హాస్పిటల్‌కే ఒక మణిహారం.
***
స్టేషన్‌కి పాకింగ్ చేసిన ముగ్గురూ వచ్చారు.
‘‘సార్! మమ్మల్ని రమ్మని చెప్పారట’’.
వాళ్ళలో ఎంతో సంశయం. ఏమైనా పోయాయా? అవి తామే తీసామని అనుమానమా? అసలే పోలీసువాళ్ళు. అసలు పనికి వీళ్ళింటికి వెళ్లకుండా ఉండాల్సింది. ఏదో వంక చెప్పి తప్పించుకోవచ్చు. ఇంకొకరిని పంపేవాళ్లు.
ఒక్క నిమిషం.. అంటూ అప్పటిదాకా తను మాట్లాడుతున్న వారిని పంపేసి వాళ్ళని వచ్చి కూర్చోమన్నాడు.
వాళ్ళు పాకింగ్ చేసే నిమిత్తం ఎక్కువ ఊళ్ళు వెళుతూ ఉండడంతో అనే్వష్ సంగతి తెలియలేదు. లేకపోతే అతన్ని అనుమానించేవారే కాదు.
మా ఇంట్లో టేబిల్‌మీద ఓ గులాబీ రంగు కవరు ఉంది. దాని గురించి మీకేమైనా తెలుసా అని కనుక్కోవటానికి పిలిచాను.
‘‘అదా!’’ అని గుండెలపైనున్న అనుమానపు భారాన్ని దింపుకున్నారు.
విషయం తెలిసిపోతోంది. విషయం తెలిసిపోతోంది అని సంబరపడింది అనే్వష్ హృదయం.
‘‘పోస్ట్‌మాస్ ఇస్తే పైకి తెచ్చి పెట్టాం సార్. ఆ హడావిడిలో చెప్పటం మరిచిపోయాం’’ అన్నాడు దారిలో ఒకతను.
‘‘పోస్ట్‌మాన్ అంత ప్రొద్దునే్న ఎందుకొస్తాడు?’’ తొమ్మిదిన్నర తర్వాత కదా బయలుదేరుతారు’’
‘‘ఏమో సార్ కాకీ డ్రెస్‌లో ఉంటే పోస్ట్‌మాన్ అనుకున్నాం’’.
‘‘అతని చేతిలో ఉత్తరాల దొంతర ఉందా?’’ ఇంకా సందేహం తీరక అడిగాడు.
‘‘ఏమో! సార్!’’ అని ‘‘ఏరా! మీలో ఎవరైనా చూసారా?’’
‘‘లేదు సార్! మేము ఎంత తొందరగా పని చేసుకువెళ్లిపోదామా అని హడావిడిలో అంతగా పట్టించుకోలేదు’’.
‘‘సరే! మీరు వెళ్లచ్చు’’ అని పంపేసాడు.
జనంలో సంపాదన లక్ష్యం పెరగటంతో అనవసర విషయాలు జోలికి వెళ్లకూడదని తత్వం ఎక్కువ కనిపిస్తోంది. మరీ పచ్చబొట్టు విషయంలో ఇది ఎక్కువ వెల్లడవుతోంది.
ఇంతకీ తను ఏదో సాధిస్తాననుకున్నది దీపావళి టపాసులా పేలాల్సింది పోయి తుస్సుమంది.
ఇక ఛమేలీ విషయం ఏవౌతుందో?
రెండో రోజు విద్య వెదకటం, అడగటం ఇవన్నీ ఎందుకని అదే రోజు వెళ్లి డ్రెస్సులు ఒకసారి చూపించమని తనే వెతికాడు, ఒకవేళ పచ్చబొట్టు అందిందని అబద్ధం చెబుతోందేమోనని.
మళ్లీ ఛమేలీ కోసం వస్తానని చెప్పి మరీ వచ్చాడు. ఆమె రాగానే కబురు చెయ్యమన్నాడు. ఆడపిల్లను పోలీసు స్టేషన్‌కు ఎందుకు పిలవటం. తన అవసరం కాబట్టి తానే వెళితే బాగుంటుందని నిశ్చయించుకున్నాడు.
ఆ రెండు రోజులు ఛమేలి కోసం ప్రియురాలికోసం ప్రియుడు వేచి ఉన్నదానికంటే ఎక్కువగానే ఎదురుచూస్తూ గడిపాడు.
ఆమె వచ్చిందని వాళ్ళన్నయ్య చెప్పగానే ఆఘమేఘాలమీద వెళ్లి వాలాడు.
‘‘్ఛమేలీ! ఆ రోజు పాంట్‌లు వేసినపుడు నా పాంట్‌లో ఒక లెటర్ ఉండాలి, చూసావా?’’
‘‘లేదు బాబూ! అమ్మగారు ననే్న చూడమంటారుగా! ఆరు చెప్పకపోయినా నేను చూస్తాను. అలాంటిదేమీ లేదే? ఏదైనా కావాల్సిన కాగితమా బాబూ!’’
‘‘ఆ! చాలా కావాల్సింది మళ్లీ దొరకనిది’’ మనసులో అనుకుంటున్నానని బయటికే అనేసారు.
‘‘అయ్యో!’’ అనుకొని ఇంటిల్లిపాది బాధపడ్డరు.
ఇక తను అక్కడ ఉండడం అనవసరమని ‘‘సరే! ఈ విషయం విద్యమ్మగారికి చెప్పకండి. తెలిస్తే కంగారుపడుతుంది. అడిగితే లేదని చెప్పండి. నేను వచ్చానని, ఇలా అడిగానని చెప్పకండి’’ అని చెప్పి బయటకు వచ్చేసాడు.
చాలా అసహనంగా ఉంది. ఉత్తరం పచ్చబొట్టుకు ఎలా చేరింది? మధ్యలో తను గమనించనపుడు వచ్చి తీసుకువెళ్లిందా? రోజూ మార్చుతూనే ఉన్నాడు. ఎప్పుడు మిస్ అయింది? మళ్లీ మళ్లీ గుర్తుతెచ్చుకున్నాడు.
నల్లప్యాంట్‌లో పెట్టడం వరకూ బాగా గుర్తు.
ఆ డ్రెస్సులోనే నాయుడుపేట కూడా వెళ్లాడు. ఆ రోజు ఏమైనా దారిలో జారిపోయిందా? తననేడిపించటానికి పచ్చబొట్టు అలా చెబుతోందా? ఏమీ అర్థం కావటంలేదే?
ఎవర్నీ అనుమానించటానికి కూడా ఎవరూ కనిపించటంలేదు. పచ్చబొట్టు ఈ రోజు పంపిన కవర్‌మీద ఈసారి కూడా స్టాంపులు లేవని గుర్తువచ్చింది ఉన్నట్టుండి అనే్వష్. అసలు తన ఉత్తరం గురించి ఆలోచిస్తున్నాడు. పచ్చబొట్టు పంపిన ఉత్తరం మరి స్టాంపులు లేకపోతే పోస్ట్‌మాన్ ఎలా తెచ్చిస్తాడు.?
అంటే ఆ వేషంలో ఎవరైనా వచ్చారా? కొంపదీసి పచ్చబొట్టు ఆ వేషంలో వచ్చిందా?
పోస్ట్‌మాన్‌ని కలిస్తే సరి. ఈ వేళప్పుడు ఉత్తరాలు పంచుతూ ఎక్కడ ఉన్నాడో ఎవరూ చెప్పలేరు. ఈ టెన్షన్ భరించేకంటే వెళ్లి ఒకసారి ఊరంతా అతని కోసం వెతికెయ్యాలనే అనిపిస్తోంది. కానీ ఎక్కడికి వెళ్లినా సమాధానాలు నెగెటివ్‌గానే వస్తూ ఉండటమే అతని ఉత్సాహాన్ని సగం చంపేస్తోంది. అందుకే సగం వెళ్లాలనిపించటంలేదు. -సశేషం

-యలమర్తి అనూరాధ 9247260206