మెయిన్ ఫీచర్

జ్ఞాపకశక్తిని పెంచుకోండిలా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒక్కోసారి ఎవరైనా వ్యక్తి పేరుగానీ, ఏదైనా స్థలం పేరుగానీ, ఏదైనా వస్తువును ఎక్కడ పెట్టామో కానీ ఎంత ప్రయత్నించినా గుర్తుకు రాదు. వయసుతోపాటు జ్ఞాపకశక్తి కూడా తగ్గిపోతుందని చిన్నప్పటి నుండి వింటూ వచ్చాం. అలాగే వయసుతో పాటు వివేచనాశక్తి, ప్రతి స్పందనలూ మందగిస్తాయని కూడా ఎప్పటినుంచో వింటున్నాం. ఎంత వయసు పెరిగినా కూడా ప్రయత్నంతో మెదడును తిరిగి ఉద్దీపనం చేసుకోవచ్చని ఇటీవలి పరిశోధనలు చెబుతున్నాయి. అందువల్ల జ్ఞాపకశక్తిని తిరిగి పునరుద్ధరించుకోవాలనుకుంటే ఈ చిన్న చిన్న సలహాలు, సూచనలను ప్రయత్నించాలి.
* వ్యాయామం వల్ల శరీరానికే కాదు మెదడుకు కూడా చాలా మంచిది. వ్యాయామం వల్ల మెదడులో కొత్త శక్తి మొదలవుతుంది. మెదడులో కొత్త సంబంధాలు ఏర్పడతాయి. అలాగే కొత్తకణాలు ఉత్పత్తి అవుతాయి. నిజంగానే.. వ్యాయామం వల్ల శరీరం ఎక్కువ ఆక్సిజన్‌ను గ్రహిస్తుంది. ఇలా మెదడుకు ఎక్కువ ఆక్సిజన్, గ్లూకోజ్ అందితే శరీరంలో టాక్సీన్ల నిర్మూలన జరుగుతుంది. అందుకని వ్యాయామాన్ని ఆరుబయట చేస్తే మరీ మంచిది. దీనివల్ల మెదడుకు ఆక్సిజన్ అందడమే కాకుండా, శరీరానికి విటమిన్ ‘డి’ కూడా లభిస్తుంది. కొత్త వాతావరణంలో, కొత్త తరహాలో వ్యామాయం చేయడానికి ప్రయత్నించాలి. గార్డెనింగ్ ఇష్టమైతే, గార్డెనింగ్ అలవాటున్నవారితో కలిసి పనిచేస్తే మరీ మంచిది. దీనివల్ల శరీరానికి వ్యాయామం లభించడంతో పాటు మెదడు కూడా చురుగ్గా మారుతుంది.
* ఒక పరిశోధన ప్రకారం ఏవైనా పదాలను గుర్తు పెట్టుకోవాలనుకున్నప్పుడు లేదా ఏదైనా నేర్చుకోవాలనుకున్నప్పుడు అటూ ఇటూ తిరుగుతూ ఆ ప్రయత్నం చేస్తే అది చాలా కాలం పాటు గుర్తుంటుందని తేలింది. కాబట్టి ఏ విషయమైనా నడుస్తూ గుర్తుచేసుకోవడానికి ప్రయత్నిస్తే మంచిది. సినిమా నటీనటులు కూడా డైలాగ్‌లు గుర్తుపెట్టుకోవడానికి ఈ విధానానే్న అనుసరిస్తారట. ఈసారి ఎప్పుడైనా ఏదైనా ప్రసంగం చేయాల్సి వస్తే నడుస్తూ లేదా డాన్స్ చేస్తూ వాటిని గుర్తుపెట్టుకునేందుకు ప్రయత్నించి చూడండి. ఈ పరిశోధన నిజమని మీరే ఒప్పుకుంటారు.
* మన శరీరానికి అందే షుగర్, శక్తిలో ఇరవై శాతం మెదడుకు వెళుతుంది. అంటే మెదడు పనితీరు పూర్తిగా గ్లూకోజ్ లెవల్స్ మీద ఆధారపడి ఉంటుంది. అందువల్ల షుగర్ లెవల్స్‌ను సరిగా నియంత్రించకపోతే మెదడు పనితీరు సరిగా ఉండదు. మానవుని జీర్ణవ్యవస్థలో ఒక వంద ట్రిలియన్లకుపైగా సూక్ష్మజీవులు ఉంటాయి. మెదడు బాగా పనిచేయాలంటే ఆ సూక్ష్మజీవులు సమతౌల్యంతో ఉండేలా చూసుకోవడం చాలా అవసరం. నిజానికి మన పొట్టను మనం రెండో మెదడుగా భావించాలి. అందుకే జ్ఞాపకశక్తిని పెంచుకోవడానికి మనం సరైన ఆహారపదార్థాలను తీసుకోవాలి. వైవిధ్యభరితమైన, ఆరోగ్యకరమైన ఆహారపదార్థాలు ఈ సూక్ష్మజీవులను సమతుల్యతతో ఉంచుతూ, మెదడు బాగా పనిచేయడానికి సహాయపడతాయి. మెదడు కణాలు కొవ్వుతో తయారవుతాయి. అందువల్ల మనం తినే ఆహారపదార్థాలలో తగినంత మంచి కొవ్వు పదార్థాలు ఉండేలా చూసుకోవాలి.
* నిజానికి జీవితంలో కొంత ఒత్తిడి అవసరం. దీనివల్ల అత్యవసర పరిస్థితుల్లో తొందరగా ప్రతిస్పందించడం అలవాటు అవుతుంది. ఒత్తిడి వల్ల కార్టిసాల్ హార్మోన్ ఉత్పత్తి జరిగి, దానివల్ల మనకు శక్తి లభించి, లక్ష్యంపై దృష్టి కేంద్రీకరించడం సాధ్యమవుతుంది. అయితే ఎక్కువ కాలం ఒత్తిడి, ఆందోళనలు మెదడుకు మంచివి కావు. అందువల్ల అప్పుడప్పుడూ ఒత్తిడి నుంచి స్విచ్ ఆఫ్ చేసుకుని, మెదడుకు విశ్రాంతి ఇవ్వడం చాలా అవసరం. ఇలాంటి సమయంలో ఆలోచనలను అదుపులో పెట్టుకోవడం కష్టమైతే మెడిటేషన్ వంటి వాటిని ప్రయత్నించాలి. దానివల్ల ఒత్తిడి కలిగిందే హార్మోన్లు సాధారణ స్థాయికి చేరుకుంటాయి.
* జ్ఞాపకశక్తిని పెంపొందించుకోవడానికి దానిని సవాలు చేయడం లేదా కొత్త అలవాట్లను నేర్చుకోవడం ఒక విధానం. ఏదైనా కళలు లేదా కొత్త భాషను నేర్చుకోవడానికి ప్రయత్నించడం వంటివి మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి. కాబట్టి స్నేహితులు లేదా కుటుంబ సభ్యులతో ఆన్‌లైన్ ఆటలు ఆడాలి. అవి మన ఆలోచనలకు పదును పెడతాయి. ఇలాంటి సమయంలోనే మనకు మనమే సవాల్ విసురుకోవాలి.. అంటే ఈ ఆటలో మనం ఎంత స్కోరు చేయాలి. ఎంతమందిని ఓడించాలి వంటివన్నమాట.
* సంగీతం ఒక ప్రత్యేక విధానంలో మెదడును ఉద్దీపన చేస్తుందని పరిశోధనలు చెబుతున్నాయి. కాబట్టి సంగీతంపై ఇష్టం పెంచుకోవాలి. ఏదైనా సంగీతాన్ని వింటున్నప్పుడు వారి మెదడును స్కాన్‌చేస్తే, అది చాలా చైతన్యవంతంగా ఉన్నట్లు గుర్తించారు పరిశోధకులు. కాబట్టి సంగీతం మన సాధారణ గ్రహణశక్తిని మెరుగుపరుస్తుంది. డిమెన్షియా వంటి వ్యాధుల్లో చివరగా చెరిగిపోయేవి సంగీతపరమైన జ్ఞాపకాలే అని కూడా గుర్తించారు పరిశోధకులు.
* పగటిపూట ఏదైనా నేర్చుకుంటే, నిద్రపోయాక అది ఒక జ్ఞాపకం మారిపోతుంది. అందువల్ల జ్ఞాపకాలను పదిలపరచుకోవడానికి నిద్ర అనేది చాలా అవసరం. పడుకునేముందు ఎవరికైనా ఒక జాబితాను ఇచ్చి పొద్దునే్న దాన్ని గుర్తు తెచ్చుకొమ్మని చెప్పండి. మరొకరికి పొద్దున్న ఆ జాబితా ఇచ్చి రాత్రి అప్పగించమని చెప్పండి. పగటిపూట నేర్చుకున్నదే బాగా గుర్తుంటుందని పరిశోధనలలో తేలింది. ఒకవేళ ఎవరైనా పరీక్షకు సిద్ధమవుతుంటే జవాబులు నేర్చుకున్న తరువాత చిన్న కునుకు తీస్తే మంచి ఫలితం ఉంటుందని పరిశోధనలలో తేలింది. అదేవిధంగా నిద్రపోయే ముందు చెడ్డ అనుభవాలను లేదా జ్ఞాపకాలను గుర్తుచేసుకోకూడదు అని చెబుతారు పెద్దలు. ఎందుకంటే వాటివల్ల చెడ్డ కలలు వస్తాయని.. అందుకే నిద్రపోయే ముందు హారర్ సినిమాలు చూడటం లేదా హారర్ కథలు చదవడం చేయకూడదు.
* ప్రతిరోజూ ఐదు గంటల కన్నా తక్కువ సేపు నిద్రపోతే మెదడు చురుగ్గా ఉండదు. అదేవిధంగా పది గంటల కన్నా ఎక్కువసేపు నిద్రపోవడం కూడా మంచిది కాదు. మనం ఎప్పుడూ చీకటిగా ఉండే గదిలో నిద్రపోవడం మేలు.