పాటల పల్లకిలో..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీ ప్రహర్షదేవి బ్యానర్‌లో రూపొందుతున్న ‘పాటలపల్లకి’ కార్యక్రమం ద్వారా నూతన గాయనీ గాయకులకు అవకాశం కల్పించి ఉజ్వల భవిష్యత్తును అందించాలనే ఆకాంక్షతో మొగుడ్స్ పెళ్లామ్స్ ఫేమ్ సంగీత దర్శకుడు రాజకిరణ్ నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి దర్శకుడిగా ఎస్.కేశవ, నిర్మాతగా కె.చిన్నమల్లయ్య, సహ నిర్మాతగా నంది కంటిబాబు రాజు వ్యవహరిస్తున్నారు. ఈ పాటల పల్లకి ప్రోగ్రాంకు సంబంధించిన ప్రోమో సాంగ్‌ను బుధవారం సాయంత్రం ప్రసాద్ ల్యాబ్‌లో అత్యుత్తమ సినీ గీత రచయితల సమక్షంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా నటుడు మరియు సింగర్ కమల్ మాట్లాడుతూ- ఇక్కడున్న కొత్త సింగర్స్ ఎవరికివారే తోపు అనుకొని ముందుకెళ్లాలని కోరుకుంటున్నా. అలాగే ఇంత మంచి కార్యక్రమాన్ని చేపట్టిన రాజ్‌కిరణ్, బాబు రాజు, చిన్న మల్లయ్యలను అభినందిస్తున్నా అన్నారు. నిర్మాత చిన్న మలయ్య మాట్లాడుతూ- నాలుగేళ్ళ క్రిందట శ్రీప్రహర్ష బ్యానర్‌ను మొదలుపెట్టాము. నాలుగు సినిమాలు చేశాము. మొదటి నా ఊహల్లో రెండు నెలల్లో విడుదల కానుంది. మనసున్నోడు, రాజఖడ్గం సినిమాలు లైన్‌లో ఉన్నాయి. ప్రస్తుతం రాజ్‌కిరణ్ సంగీత సారథ్యంలో పాటల పల్లకి నిర్వహిస్తున్నాము. ఈ ప్రోగ్రాం ద్వారా ఎంతోమంది న్యూ సింగర్స్‌ను పరిచయం చేయనున్నాము అన్నారు. సంగీత దర్శకుడు రాజ్‌కిరణ్ మాట్లడుతూ- మహాసంగీత దర్శకులు సమకూర్చిన అద్భుతమైన బాణీలను చిరస్థాయిగా భావి తరాలవారికి కూడా నిలిచి ఉండాలనే ఆశతో అలనాటి పాటలను మరలా సమకూర్చి మా పాటల పల్లకి ద్వారా పాడాలని ఆసక్తి, పాడగల ప్రతి ఒక్కరికీ అవకాశం కల్పించి తద్వారా ఎంతోమందికి ఆర్థికగా కొంచెం సహాయపడాలనే ఉద్దేశ్యంతో సిద్ధం అవుతోంది అన్నారు.