క్రీడాభూమి

ఆసియా కప్‌లో కీలకం కానున్న రోహిత్, ధావన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: ఈనెల 18 నుంచి జరిగే ఆసియా కప్‌లో టీమిండియా జట్టులో రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ అత్యంత కీలకం కానున్నారని ఆస్ట్రేలియా మాజీ ఫాస్ట్‌బౌలర్ బ్రెట్ లీ వ్యాఖ్యానించాడు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి విశ్రాంతి ఇస్తున్న నేపథ్యంలో జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించనున్న రోహిత్ శర్మ, వైస్‌కెప్టెన్‌గా వ్యవహరించనున్న శిఖర్ ధావన్ జట్టును అత్యంత బాధ్యతాయుతంగా ముందుకు తీసుకువెళ్లగలరనే నమ్మకం తనకు ఉందని ఆశాభావం వ్యక్తం చేశాడు. ఆసియా కప్‌లో ఆడే జట్లతో పలువురు ఎడమచేతివాటం కలిగిన ఫాస్ట్‌బౌలర్లను రోహిత్ శర్మ ఎదుర్కోవడం కష్టమంటూ వస్తున్న విమర్శల నేపథ్యంలో ఎలాంటి బౌలర్లనైనా ఎదుర్కొనే సత్తా రోహిత్‌కు ఉందని బ్రెట్ లీ సమర్థించాడు. అదేవిధంగా టీమిండియా వైస్‌కెప్టెన్ శిఖర్ ధావన్ సైతం తనకు తెలిసిన కొన్ని మెలకువలతో రాణిస్తాడని అన్నాడు.