క్రీడాభూమి

మరో రికార్డుకు చేరువలో విరాట్ కోహ్లీ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో రికార్డుకు చేరువలో ఉన్నాడు. ప్రస్తుతం కోహ్లీ టెస్టుల్లో 23 సెంచరీలు సాధించాడు. లండన్‌లోని కెన్నింగ్టన్ ఓవల్‌లో శుక్రవారం నుండి ఇంగ్లాండ్‌తో జరిగే ఆఖరిది, 5వ టెస్టు మ్యాచ్‌లో కోహ్లీ సెంచరీ సాధిస్తే వెస్టిండీస్ దిగ్గజం వివియాన్ రిచర్డ్స్ టెస్టుల్లో చేసిన 24 సెంచరీల రికార్డుతో సమం కానున్నాడు. 29 ఏళ్ల విరాట్ కోహ్లీ ఇంతవరకు 79 టెస్టు మ్యాచ్‌లు ఆడడం ద్వారా 6098 పరుగులు సాధించాడు. రిచర్డ్స్ 121 టెస్టు మ్యాచ్‌ల ద్వారా 8540 పరుగులు చేశాడు. భారత మాజీ కెప్టెన్ సచిన్ తెండూల్కర్ టెస్టుల్లో 51 సెంచరీలతో అగ్రస్థానంలో ఉన్నాడు.
ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లలో తెండూల్కర్ 2535 పరుగులు చేయగా, ఇందులో ఏడు సెంచరీలు, 13 అర్ధ సెంచరీలు ఉన్నాయి. విరాట్ కోహ్లీ 1500 పరుగులు సాధించాడు. సచిన్ తెండూల్కర్ తర్వాత అత్యధిక పరుగులు చేసిన భారత క్రికెటర్లలో సునీల్ గవాస్కర్ (2483), రాహుల్ ద్రావిడ్ (1950), గుండప్ప విశ్వనాథ్ (1880), దిలీప్ వెంగ్‌సర్కార్ (1589) పరుగులు సాధించారు.