క్రీడాభూమి

ఆ బాధ మాకూ ఉంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, సెప్టెంబర్ 6: ఇంగ్లాండ్‌తో ఐదు టెస్టు మ్యాచ్‌లలో భాగంగా ఇప్పటికే 3-1తో వెనుకబడిన టీమిండియా సిరీస్‌ను కోల్పోయిన నేపథ్యంలో తమపై అభిమానులు పెట్టుకున్న ఆశలు అడియాసలు కావడంతో జట్టు ఓపెనర్ శిఖర్ ధావన్ సైతం ఆవేదనను వ్యక్తం చేశాడు. టెస్టు సిరీస్‌లో చివరిది, ఐదో మ్యాచ్ శుక్రవారం జరుగనున్న తరుణంలో గత మ్యాచ్‌లలో జరిగిన పొరపాట్లు మళ్లీ పునరావృతం కాకుండా ముందుకు దూసుకువెళ్తామని అన్నాడు. ఈ సిరీస్‌లో టీమిండియా ఓపెనర్లుగా దిగిన శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్‌తోపాటు మురళీ విజయ్ ప్రదర్శన అత్యంత పేలవంగా ఉండడంతో పలువురు సీనియర్ క్రికెటర్లు బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఇంగ్లాండ్ సిరీస్‌లో ధావన్ 158, రాహుల్ 113, మురళీ విజయ్ రెండు మ్యాచ్‌లలో కేవలం 26 పరుగులు సాధించారు.
ఆఖరి మ్యాచ్‌లో ప్రత్యర్థికి గట్టి పోటీ ఇవ్వడం ద్వారా సిరీస్ పోయినా కొంత ఊరట కలుగుతుందన్న ఆశాభావాన్ని ధావన్ వ్యక్తం చేశాడు.