అంతర్జాతీయం

రండి.. పెట్టుబడులు పెట్టండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సోఫియా: తాము ప్రవేశపెట్టిన ‘మేకిన్ ఇండియా’ కార్యక్రమంలో భాగంగా తమ దేశంలో పెట్టుబడులను పెట్టాలని భారత రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్ బల్గేరియా దేశ కంపెనీలను ఆహ్వానించారు. గురువారం ఆయన ఆ దేశ ప్రధాని బోయ్‌కో బొరిసేవ్‌ను కలిసి పలు అంశాలను చర్చించారు.
మూడు యూరప్ దేశాల్లో ఎనిమిది రోజుల పర్యటనలో భాగంగా రాష్టప్రతి సిప్రస్ నుంచి ఇక్కడకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన బల్గేరియా ప్రధానితో సమావేశమై ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత పటిష్టం కావాలని ఆకాంక్షించారు. తమ దేశంలో కంపెనీలను స్థాపించాలని ఆ దేశ కంపెనీలను ఆహ్వానించారు. ప్రస్తుతం ఇరుదేశాల మధ్య 300 మిలియన్‌ల యూఎస్ డీలర్ల వాణిజ్యం జరుగుతోందని, అయితే ఇరుదేశాల మధ్య వాణిజ్య సంబంధాలు మరింత పటిష్టం చేసుకుంటే దీనిని మరింత ఎక్కువ చేయవచ్చునని రాష్టప్రతి పేర్కొన్నట్టు ఆయన సచివాలయ వర్గాలు ట్వీట్ చేశాయి. ఇరుదేశాల మధ్య రాజకీయ సంబంధాలు లోతుగా, బలంగా ఉన్నాయని, వాణిజ్య సంబంధాలు కూడా మరింత ఎక్కువ చేయాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. సానుకూలంగా ఉన్న భారత ఆర్థిక వ్యవస్థలో బల్గేరియా కంపెనీలు పెట్టుబడులు పెడితే మంచి అభివృద్ధి సాధించవచ్చునని ఆయన చెప్పారు. ఈ సందర్భంగా జరిగిన వాణిజ్య సహకార సమావేశంలో బయోటెక్నాలజీ, ఆటోమొబైల్స్, వ్యవసాయం, మెడికల్, రక్షణ ఉత్పత్తులు, వౌలిక రంగం, టూరిజం వంటి రంగాల్లో విస్తృతంగా పెట్టుబడులకు అవకాశాలు ఉన్నాయని చెప్పారు. ప్రస్తుతం 8.2 శాతం అభివృద్ధి రేటుతో ఉన్న భారత్ 2025 నాటికి ఐదు ట్రిలియన్‌ల ఆర్థిక వ్యవస్థగా మారుతుందని ఆయన చెప్పారు. ప్రపంచంలోనే ఆరో అతిపెద్ద ఆర్థికవ్యవస్థ గల దేశంగా మారిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఐఎంఎఫ్ అంచనా ప్రకారం 2019 నాటికి భారత్ వృద్ధిరేటు 7.8 శాతానికి చేరుకుంటుందన్నారు. అలాగే కృత్రిమ మేధ, డాటా అనలిటిక్స్, రోబోటిక్స్, నానోటెక్నాలజీ రంగాల్లో ఇరుదేశాలు పరస్పర సహకారం అందించుకోవచ్చునని రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్ తెలిపారు.

చిత్రం..బల్గేరియా అధ్యక్షుడు రుమెన్ రాదెవ్‌తో రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్ దంపతులు