తెలంగాణ

విత్తనాలు ఎగుమతి చేస్తున్నాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 6: తెలంగాణ రాష్ట్రంలో ఆర్గనైజేషన్ ఫర్ ఎకనమిక్ కోఆపరేషన్ అండ్ డెవెలప్‌మెంట్ (ఓఈసీడీ) ధృవీకరణ ద్వారా విత్తనాలను ధృవీకరించడం వల్ల విదేశాలకు తెలంగాణ విత్తనాన్ని ఎగుమతి చేసేందుకు వీలవుతోందని టీఎస్‌ఎస్‌ఓసీఏ డైరెక్టర్ డాక్టర్ కే. కేశవులు తెలిపారు. అస్సాం రాష్ట్రానికి చెందిన వ్యవసాయ శాఖ అదనపు ముఖ్యకార్యదర్శి వి. భాస్కర్ గురువారం హైదరాబాద్ వచ్చారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో విత్తనాభివృద్ధి గురించి తెలుసుకునేందుకు ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కేశవులు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా తెలంగాణలో విత్తనాభివృద్ధి గురించి వివరించారు. ప్రభుత్వం పక్షాన తెలంగాణ రైతులకు అందిస్తున్న పథకాలు, కార్యక్రమాల గురించి కూడా కేశవులు వివరించారు. విత్తనోత్పత్తి, విత్తన మార్కెటింగ్‌కు సంబంధించి అస్సాం-తెలంగాణ కలిసి ముందుకు సాగాలని ఈ సందర్భంగా నిర్ణయించారు.

చిత్రం..హైదరాబాద్‌కు వచ్చిన అస్సాం వ్యవసాయ శాఖ అదనపు ముఖ్య కార్యదర్శి భాస్కర్ తెలంగాణలో
విత్తనాభివృద్ధి గురించి తెలుసుకునేందుకు గురువారం ఉన్నతాధికారులతో సమావేశమయన దృశ్యం