ఆంధ్రప్రదేశ్‌

ప్రధాన నగరాలు, పట్టణాల్లో రాత్రి 12 గంటల వరకు హోటళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, సెప్టెంబర్ 6: రాష్ట్రంలోని ప్రధాన నగరాలు, పట్టణాల్లో రాత్రి 12 గంటల వరకు హోటళ్లకు అనుమతించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఫుడ్ కోర్టులపై మరో వారంరోజుల్లో జీవో విడుదల చేసేందుకు రంగం సిద్ధమైంది. ఈ విషయమై గురువారం సచివాలయంలో కార్మికశాఖ మంత్రి కార్యాలయంలో ఏపీ హోటల్స్ అసోసియేషన్ సభ్యులతో కార్మిక, ఉపాధికల్పన శాఖ మంత్రి పితాని సత్యనారాయణ సమావేశమయ్యారు. హోటళ్లకు రాత్రి 10.30 గంటల వరకే అనుమతివ్వటంతో ఇబ్బందికరంగా ఉందని అసోసియేషన్ ప్రతినిధులు మంత్రి దృష్టికి తెచ్చారు. ఈ నేపథ్యంలో పోలీస్, కార్మికశాఖ అధికారులతో మంత్రి చర్చించారు. ముందుగా అనుమతి పొందిన హోటళ్లు 12 గంటల వరకు నిర్వహించేందుకు చర్యలు చేపడతామని మంత్రి హామీ ఇచ్చారు. నూతన రాజధాని నేపథ్యంలో గతంలో ముఖ్యమంత్రి ఫుడ్ కోర్టులకు అనుమతించారని హోటల్స్ అసోసియేషన్ ప్రతినిధులు గుర్తుచేశారు. దీనిపై వారంలోగా జీవో జారీచేసేందుకు చర్యలు తీసుకోవాలని మంత్రి పితాని అధికారులను ఆదేశించారు. సమావేశంలో కార్మికశాఖ కమిషనర్ వరప్రసాద్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ గజరావ్ భూపాల్, హోటల్ అసోసియేషన్ అధ్యక్షులు ఎం శ్రీనుబాబు తదితరులు పాల్గొన్నారు.

కేరళ వరద బాధితులకు ఏపీ హోటల్స్ అసోసియేషన్ వితరణ
అమరావతి, సెప్టెంబర్ 6: కేరళ వరద బాధితులకు ఏపీ హోటల్స్ అసోసియేషన్ 20 లక్షల రూపాయల విరాళాన్ని ప్రకటించింది. అసోసియేషన్ ప్రతినిధులు గురువారం ఉండవల్లి నివాసంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలుసుకుని చెక్కును అందజేశారు. వివిధ జిల్లాల్లో కలెక్టర్ల ద్వారా ఇప్పటికే రూ 30లక్షల విలువైన వస్తువులను బాధితులకు పంపినట్లు అసోసియేషన్ అధ్యక్షులు ముత్తవరపు శ్రీనివాసబాబు, కార్యదర్శి టీ సత్యనారాయణ, ఎగ్జిక్యూటివ్ కార్యదర్శి ఎం వెంకయ్య, కోశాధికారి కొల్లా శ్రీనివాస్, ప్రతినిధులు ఐలాపురం రాజా, రమణ, సంజయ్‌జైన్, రాజేంద్రప్రసాద్ ముఖ్యమంత్రికి వివరించారు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు గతంలో కూడా హోటల్ యజమానులు మానవతా దృక్పథంతో స్పందించారని ముఖ్యమంత్రి ప్రశంసించారు. హుదుద్ తుపాను విశాఖలో అల్లకల్లోలం సృష్టించినప్పుడు విజయవాడ హోటల్ అసోసియేషన్, లారీ యజమానులు స్పందించిన తీరును అభినందించారు.