ఆంధ్రప్రదేశ్‌

19 వరకు అసెంబ్లీ సమావేశాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, సెప్టెంబర్ 6: శాసనసభ సమావేశాలు ఈ నెల 19వ తేదీ వరకు నిర్వహించాలని బిజినెస్ అడ్వయజరీ కమిటీ (బీఏసీ) నిర్ణయంచింది. గురువారం ఉదయం 9.45 గంటలకు సమావేశాలు ప్రారంభమయ్యాయి. తొలిరోజు సమావేశాల్లో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఉండవల్లిలోని తన నివాసం నుంచి శాసనసభ మార్గంలో వెంకటపాలెం వద్ద ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలువేసి నివాళులర్పించిన అనంతరం సమావేశాలకు హాజరయ్యారు. ఇదిలా ఉండగా సమావేశాల నిర్వహణపై ఏర్పాటైన బిజినెస్ అడ్వయిజరీ కమిటీ (బీఏసీ)లో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావు అధ్యక్షతన ఏర్పాటైన బీఏసీలో ఈనెల 19వ తేదీ వరకు సమావేశాలు జరపాలని నిర్ణయించారు. అంటే సెలవులు పోగా వారం రోజుల పాటు జరుగుతాయి. ఈనెల 8,9 తేదీలు రెండవ శనివారం, ఆదివారం సెలవు ప్రకటించారు. 10,11 తేదీలు సమావేశాలు జరుగుతాయి. 12 నుంచి 14వ తేదీ వరకు వినాయకచవితి సెలవు. శని, ఆదివారాల అనంతరం తిరిగి 17 నుంచి 19 వరకు సమావేశాలు కొనసాగించాలని నిర్ణయించారు. అధికార టీడీపీ 17 అంశాలు, బీజేపీ 14 అంశాలను బీఏసీలో ప్రతిపాదించాయి. కాగా తొలిరోజు సమావేశాల్లో భాగంగా ప్రశ్నోత్తరాల అనంతరం దివంగత మాజీప్రధాని అటల్‌బిహారీ వాజ్‌పేయి మృతికి సంతాప సూచకంగా సభ రెండు నిమిషాలు వౌనం పాటించింది. వాజ్‌పేయి నిబద్ధత కలిగిన నేతగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నివాళులర్పించి సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అనంతరం అన్న క్యాంటీన్లపై లఘు చర్చ జరిగింది. టీడీపీ ఎమ్మెల్యేలతో పాటు బీజేపీ ఫ్లోర్‌లీడర్ విష్ణుకుమార్‌రాజు సైతం అన్న క్యాంటీన్లు అద్భుతమని ప్రశంసించారు. అనంతరం వాయిదాపడింది. రాష్ట్రంలో కరవు, బారీ వర్షాల కారణంగా ఏర్పడిన పంట నష్టంపై శుక్రవారం సభలో చర్చ జరగనుంది.