మెయిన్ ఫీచర్

గోపూజా పర్వదినం - పోలాల అమావాస్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భిన్న సంస్కృతులు, భాషలు, ధర్మాలు, ప్రజల కేంద్రస్థానమై, అఖండ మరియు అవిభాజ్యమైన సంస్కృతికి మూలాధారమైన భారతావని ప్రాచీన కాలంనుండీ వ్యవసాయ ప్రధాన దేశం కావడం, గ్రామీణులలో అధిక సంఖ్యాకులు రైతులే కావడం, ఎడ్లు మరియు నాగళ్ళతో విడదీయరాని బంధం, అనుబంధాన్ని ఏర్పరచుకున్న రైతు, వాటికి కృతజ్ఞతను ప్రకటించే వారసత్వ ఆచార క్రమంలో ఏటా శ్రావణ మాస ముగింపు దినమైన అమావాస్యను ‘పోలాల అమావాస్య’గా పండగ జరుపుకోవడం అనాదిగా వస్తున్న సత్సాంప్రదాయం. దీనిని గో, వృషభ ఉద్దిష్టమైన పర్వదినంగా భావిస్తారు.
శ్రావణ కృష్ణ అమావాస్యను తెలుగు ప్రజలు ‘‘పోలామావాస్య లేక పోలాలామావాస్య‘‘గా వ్యవహరిస్తారు. ‘పోల’ అనగా కడుపునిండా మేతమేసి నీరుత్రాగి పనిపాట లేకుండిన ఎద్దు అని అర్థం. ‘అమా’ అంటే అమావాస్య. పోలాలామావాస్య అంటే ఎద్దులను బాగా మేపే అమావాస్య అని అర్థం. పౌరాణిక గాథ ప్రకారం అంధకాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మను గూర్చి తపస్సుచేసి, అనేక వరాలు పొంది, వరగర్వం చేత ఒకసారి పార్వతినే కామించడం జరిగింది. శివుడు భూలోకానికి వెళ్ళిన వేళ కనిపెట్టి, అంధకాసురుడు పార్వతి వద్దకు వెళ్ళి తన దుష్టచింతను తెలిపాడు. అదిగాంచి వాకిట కావలిగల నంది అంధకునితో యుద్ధానికి తలపడ్డాడు. ఇంతలో శివుడు వచ్చి వియయం తెలుసుకుని అంధకాసురిని సంహరించారు. ఈసందర్భంలో నందికేశ్వరుడు చేసిన సాయానికి మెచ్చి ఏదైనా వరం కోరుకోమన్నాడు. శిలాదుడు పొలము కెక్కిరిస్తూండగా ఆది వృషభ రూపమున నేను, ఆయనకు దొరికిన రోజు శ్రావణ బహుళ అమావాస్య కనుక ఆనాడు వృషభ పూజ చేస్తే ఫలప్రదమయ్యేట్లు అనుగ్రహించమమని వేడుకోగా, శివుడు అనుగ్రహించాడని తెలుస్తున్నది. మాళవ దేశంలో ‘పోల’ పండువగా, మహారాష్టల్రో ‘పిథోరి’ అమావాస్యగా, ఆంధ్రదేశంలో ‘పోలాంబ’ వ్రతాచరణలు ఆచరణలో ఉన్నాయి. అలాగే పోలాల అమావాస్యతో ముడివడియున్న ‘‘పోలాంబ లేక పోలకమ్మ, పోలేరమ్మ’’ పేరుతో దేవీ పూజలు ఆచరించే నేపధ్యంలో, పిల్లలకు అకాల మృత్యు భయముండకుండా, పసుపు కొమ్ము కట్టిన తోరములను కట్టే కార్యక్రమాలు ఆచరిస్తారు. పోలాల అమావాస్య వేడుకల నిర్వహణ సనాతన ఆచారంగా వస్తున్నది. ఏరువాక (జ్యేష్ట) పౌర్ణమి నుండి వ్యవసాయ పనులతో తీరిక ఉండని ఎద్దులకు ఆటవిడుపుగా, రైతులు ఎద్దుల నాలుకలకు ఉప్పురాచి, నాగలి కట్టక, వ్యవసాయ పనులకు తాత్కాలికంగా విశ్రాంతి నొసంగి, ఎడ్లను రంగు రంగులతో అందంగా, ఆకర్షణీయంగా తీర్చిదిద్ది, అలంకరించి, వృషభోత్సవాన్ని ఆనందోత్సాహాల మధ్య జరుపుకుంటారు. పోలాల అమావాస్య సందర్భంగా గృహిణులు మట్టితో ఎడ్లను, పశువుల కాపరి మృణ్మయ మూర్తులను తయారు చేసి, పూజలు నిర్వహిస్తారు. సర్వబాధల, సకల రోగాల నివారణార్థం మరియు సర్వజనులు సుఖ శాంతులలో వర్థిల్లాలని గ్రామ దేవతయైన పోచమ్మను ప్రార్థించి, ఆరాధించి, సువాసినులను తమ ఇళ్ళకు విందులకు ఆహ్వానించి, పోచమ్మతల్లి ప్రతిరూపాలుగా భావించి, కైమోడ్పులిడి, భోజన తాంబూల, దక్షిణ, కట్నకానుకలతో సంతృప్తి పరచే ప్రత్యేక కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో ఆచరిస్తారు. ఈసందర్భంగా ముత్తయిదువలు పోటీలుపడి వంటకాలను తయారు చేయడం సనాతన ఆచారంలో భాగం.

-సంగనభట్ల రామకిష్టయ్య 9440595494