అనగనగా ఓ ప్రేమకథ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రముఖ నిర్మాత డి.వి.ఎస్.రాజు అల్లుడు కె.ఎల్.ఎన్.రాజు గత 30 ఏళ్లుగా సినిమా రంగంలో ప్రముఖ నిర్మాతలకు ఫైనాన్షియర్‌గా కొనసాగుతున్నారు. ఆయన చాలారోజుల తర్వాత నిర్మాతగా థౌజండ్ లైట్స్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ అనే బ్యానర్‌ను స్థాపించి ‘అనగనగా ఓ ప్రేమకథ’ అనే చిత్రాన్ని నిర్మిస్తున్నారు. షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ చిత్రం నిర్మాణానంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను యువ హీరో వరుణ్‌తేజ్ తన ‘ట్విట్టర్’లో ఆవిష్కరించి, చిత్ర యూనిట్‌కు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత కె.ఎల్.ఎన్.రాజు మాట్లాడుతూ.. థౌజండ్ లైట్స్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌ని స్థాపించి ఈ సినిమాద్వారా నూతన హీరో హీరోయిన్‌లను పరిచయం చేస్తున్నాం. ప్రతాప్‌గారు ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఓ మంచి కథతో రూపొందుతున్న ఈ చిత్రం విజయం సాధించాలని ఆశిస్తున్నాను అని తెలిపారు. చిత్రం ఫస్ట్‌లుక్‌ను హీరో వరుణ్‌తేజ్‌గారు ఆవిష్కరించటం సంతోషంగా ఉందని, కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ఈ చిత్రాన్ని అక్టోబర్ నెలలో విడుదల చేయటానికి సిద్ధం చేస్తున్నాం అని తెలిపారు.