డిసెంబర్ 14న తొలి కిరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పి.డి.రాజు, బెనర్జి ముఖ్యపాత్రల్లో జాన్‌బాబు దర్శకత్వంలో సువర్ణ క్రియేషన్స్ పతాకంపై బేబి మేరి విజయ సమర్పణలో తెరకెక్కుతున్న చిత్రం ‘తొలి కిరణం’. క్రీస్తు జీవిత చరిత్ర ఆధారంగా వినూత్నంగా తెరకెక్కించిన చారిత్రాత్మక చిత్రమిది. డిసెంబర్ 14న ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతున్న సందర్భంగా శుక్రవారం హైదరాబాద్‌లో పాత్రికేయుల సమావేశం ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా సీనియర్ దర్శకుడు సాగర్ పాల్గొని చిత్ర యూనిట్‌కు శుభకాంక్షలు తెలియజేశారు. అనంతరం దర్శకుడు జాన్ బాబు మాట్లాడుతూ- చాలా కష్టపడి ఈ చిత్రాన్ని నిర్మించాం. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే అంశాలుంటాయి. 45 నిమిషాలపాటు గ్రాఫిక్స్ వుంటుంది. క్రీస్తు శిలువ వేసిన తరువాత మళ్లీ పుట్టి ఆ తరువాత 40 రోజులు ఉన్నాడు. అప్పుడు ఏం జరిగిందన్న కథతో తెరకెక్కుతున్న మొదటి చిత్రం ఇది అన్నారు. నటుడు పి.డి.రాజు మాట్లాడుతూ- మా దర్శకుడు జాన్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఆయనకు శుభకాంక్షలు. సినిమా బాగా వచ్చింది. చాలా కష్టపడి టీమ్ అందరం పనిచేశాము. తప్పకుండా ఈ చిత్రం మంచి విజయం సాధిస్తుంది అన్నారు. బెనర్జి మాట్లాడుతూ- సహజత్వంతో నిండిన చిత్రమిది. ఏసుక్రీస్తు వాళ్లని ఆశీర్వదించాడు కాబట్టి ఇంత మంచి సినిమా తీశాడు. ఇప్పటికే విడుదలైన పాటలు మంచి విజయాన్ని సాధించాయి. ఆర్.పి.పట్నాయక్ పాటలు హైలెట్‌గా నిలుస్తాయి. ఇలాంటి సినిమాలు సమాజానికి చాలా అవసరం అన్నారు. ఈ చిత్రానికి సంగీతం ఆర్.పి.పట్నాయక్. కథ, మాటలు:ప్రణీత, సమర్పణ:ప్రభు కిరణ్, పాటలు:చంద్రబోస్, కెమెరా:ఎం.మురళి, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: జె.జాన్ బాబు.