ప్రేమలో ఎందుకో ఏమో..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహేశ్వర క్రియేషన్స్ పతాకంపై నందు, నోయల్, పునర్నవి హీరో హీరోయిన్లుగా కోటి వద్దినేని దర్శకత్వంలో మాలతి వద్దినేని నిర్మిస్తోన్న చిత్రం ‘ఎందుకో ఏమో’. ఇటీవల ఈ చిత్రం టీజర్, సాంగ్స్ విడుదలై సినిమాపై మంచి క్రేజ్‌ని ఏర్పరిచాయి. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ చిత్రం ఈనెల 12న వినాయకచవితి కానుకగా విడుదలవుతోంది. ఈ సందర్భంగా దర్శకుడు కోటి వద్దినేని మాట్లాడుతూ.. ఇదొక ట్రయాంగిల్ లవ్‌స్టోరీ. కథ, కథనాలు కొత్తగా ఉంటూ అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే విధంగా ఉంటుంది. నిర్మాత మాలతి వద్దినేని మాట్లాడుతూ ఇది మా తొలి సినిమా. టీజర్, పాటలకు మంచి రెస్పాన్స్ వస్తోంది. మ్యాంగో ఆడియో ద్వారా పాటలు విడుదలయ్యాయి. దర్శకుడు చెప్పిన కథ నచ్చడంతో సినిమాను ఏ విషయంలో రాజీపడకుండా నిర్మించాం. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే సినిమా అవుతుంది. సెన్సార్ పూర్తయింది. వినాయకచవితి కానుకగా 12న విడుదల చేస్తున్నాం అన్నారు. పోసాని, సూర్య, సుడిగాలి సుధీర్, నవీన్, రాకెట్ రాఘవ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం:ప్రవీణ్, కెమెరా: జి.యస్.రాజ్, ఎడిటింగ్: మధు, నిర్మాత: మాలతి వద్దినేని, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కోటి వద్దినేని.