క్రేజీ ఫాలోయింగ్..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏ మాయ చేసావే సినిమాతో తెలుగు తెరకు పరిచయమై తెలుగు ప్రేక్షకుల్ని తన మాయలో పడేసింది జెస్సీ అలియాస్ సమంత. ఆ సినిమా తరువాత వరుస విజయాలతో స్టార్ హీరోయిన్‌గా సౌత్‌లో పాగావేసింది. సమంత అందానికి దాసోహమనని ప్రేక్షకుడు లేడు. నటిగానూ, గ్లామర్ గాళ్‌గానూ తనదైన ఇమేజ్‌ని సంపాదించుకున్న సమంతకు సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో ఫాలోయింగ్ వుంది. ఇటీవలే అక్కినేని నాగచైతన్యను పెళ్లాడిన ఈమెకు పెళ్లి తరువాత క్రేజ్ తగ్గుతుందని అనుకున్నారు కానీ దానికి రివర్స్‌గా ఫాలోయింగ్ పెరుగుతూనే వుంది. ఈమధ్యే తెలంగాణ ప్రభుత్వంలో చేనేత వస్త్రాలకు బ్రాండ్ అంబాసిడర్‌గా కూడా ప్రచారాన్ని నిర్వహించిన సమంతకు ఇండియాలో ఏ స్టార్‌కు దక్కని ఫాలోయింగ్ ఏర్పడింది. దాదాపు 7 మిలియన్ల మంది అనుచరులు ట్విట్టర్ అకౌంట్‌లో వున్నారు. ఎప్పటికప్పుడు సామాజిక మాధ్యమాల్లో యాక్టివ్‌గా వుంటూ తనకు సంబంధించిన విషయాలను ప్రేక్షకులకు పంచుకుంటోంది. త్వరలోనే ఈమె కోటిమందిని దాటడం ఖాయమని అంటున్నారు. ఈ ఏడాది రంగస్థలం, అభిమన్యుడు, మహానటి వంటి విజయాల్ని అందుకున్న సమంత, తాజాగా యు టర్న్ చిత్రంతో మరోసారి ముందుకు రానుంది. మరోవైపు తమిళంలో కూడా బిజీగా మారింది.